STOCKS

News


కొత్తగా 20 ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్లు

Thursday 20th December 2018
news_main1545284234.png-23107

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) సాంకేతిక సాయం అందించేందుకు అదనంగా మరో 20 టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెప్పారు. అధునాత ఉత్పత్తి సాంకేతికత, నైపుణ్య శిక్షణ, వ్యాపార సలహాలకు సంబంధించి ఈ కేంద్రాలు ఎంఎస్‌ఎంఈలకు సాయం చేస్తాయన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పరుస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 10 ఎంఎస్‌ఎంఈ కేంద్రాలున్నాయి. సమాయనుగత రుణసాయం అందకపోవడం సహా ఈ రంగం పలు సమస్యలను ఎదుర్కొంటోందని, ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు. పీఎంఈజీపీ, క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌ తదితరాలు కొత్తగా 19 లక్షల మంది ఎంటర్‌ప్రెన్యూర్లు తయారయ్యేందుకు దోహదం చేశాయని వివరించారు. వీరు మరో కోటి మందికి ఉపాధి కల్పించారన్నారు. ఎంఎస్‌ఎంఈలు గ్లోబల్‌ వాల్యూ ఛైన్‌లో భాగమయ్యేందుకు యత్నించాలని వాణిజ్యమంత్రి సురేశ్‌ ప్రభు సూచించారు. ఎంస్‌ఎంఈ ఎగుమతుల ప్రోత్సాహానికి 15 దేశాల్లో ట్రేడ్‌ ప్రమోషన్‌ కేంద్రాలను ఏర్పరిచేయోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈల వాటా 45 శాతం. సేవల రంగం జీడీపీలో వీటి వాటా 24.63 శాతం కాగా ఉత్పత్తిరంగ జీడీపీలో వాటా 33.4 శాతంగా ఉంది. 



You may be interested

కళ తప్పిన మెటల్‌ షేర్లు

Thursday 20th December 2018

టాప్‌ లూజర్లుగా హిందాల్కో, వేదాంత అంతర్జాతీయంగా మెటల్‌ ధరల పతనంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లో మెటల్‌ షేర్లు కళ తప్పాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 1.50శాతం నష్టపోయింది. ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల పెంపు తరువాత డాలర్‌ మారకంలో కాపర్‌తో సహా వివిధ మెటల్‌ ధరలు నష్టాల బాట పట్టాయి. వడ్డీరేట్ల పెంపుతో వినియోగ శక్తి తగ్గి వ్యవస్థలో ఆర్థిక మందగమనం

మరింత సరళంగా ప్రత్యక్షపన్ను చట్టాలు

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: ఆదాయపన్ను చట్టాన్ని మరింత సరళంగా, ప్రజలకు మరింత స్పష్టంగా అర్ధమయ్యేలా తీర్చిదిద్దేందుకు ఒక కొత్త ప్యానెల్‌ ఏర్పాటైంది. అనేక ఉదాహరణలు, నిబంధనలతో క్లిష్టంగా మారిన చట్టంలోని భాగాలపై ప్యానెల్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టనుందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. భారత ఆదాయపన్ను చట్టాన్ని 1961లో రూపొందించారు. ఇప్పటికీ చట్టంలోని పలు అంశాలు సామాన్యులకు కొరుకుడు పడని రీతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి మరింత విపులంగా ఐటీ చట్టాన్ని తీసుకుపోయేందుకు

Most from this category