STOCKS

News


వృద్ధి కోసమే రేట్ల కోత

Friday 19th April 2019
news_main1555653377.png-25224

వెలుగుచూసిన ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ వివరాలు

ముంబై: దేశ వృద్ధి అవకాశాలు బలహీనపడడం, అదే సమయంలో అంతర్జాతీయ మందగమన అంశాలు రెపో రేటును పావు శాతం తగ్గించేలా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఓటు వేసేందుకు దారి చూపించాయి. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశంలో రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం వెలువడిన విషయం తెలిసిందే. నాటి సమావేశంలో కమిటీ సభ్యుల మధ్య జరిగిన చర్చా వివరాలు గురువారం విడుదలయ్యాయి. డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య  కీలక రేట్లలో యథాతథ స్థితి ఉండాలని నాటి సమావేశంలో మొగ్గు చూపారు. రేట్ల తగ్గింపునకు మరికొంత సమయం వేచి చూస్తే బావుంటుందని, తదుపరి గణాంకాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఆచార్యతోపాటు చేతన్‌ ఘటే కూడా నాడు రేట్ల తగ్గింపునకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కీలక రేట్లను తరచూ మార్చడం వల్ల అనిశ్చితికి తావిచ్చినట్టు అవుతుందని చేతన్‌ ఘటే అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన రేట్ల కోతకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 
ఆర్‌బీఐ గవర్నర్‌ సహా నలుగురు మాత్రం రేట్ల కోతకు అనుకూలంగా ఓటేశారు. దీంతో రెపో రేటును ఆర్‌బీఐ పావు శాతం తగ్గించి 6 శాతం చేసింది. బ్యాంకులకు తానిచ్చిన నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే రేటును రెపోరేటుగా పేర్కొంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి సమావేశం తర్వాత అంతర్జాతీయంగా వృద్ధి నిదానించడం వల్ల భారత ఎగుమతులకు ఉన్న సమస్యలు, దేశ జీడీపీ వృద్ధి మరింత బలహీనపడే అవకాశాలను శక్తికాంతదాస్‌ ప్రస్తావించారు. వృద్ధి మరికాస్త తగ్గుముఖం పట్టనుందని బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు వినియోగం తగ్గుదల నేపథ్యంలో ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు, దేశీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో వృద్ధి క్షీణిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పెట్టుబడుల డిమాండ్‌ వేగం తగ్గుతోందని, ఎగుమతుల క్షీణత పెట్టుబడులపై మరింత ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
వృద్ధిని కాపాడుకోవాలంటే తప్పదు... 
‘‘ద్రవ్యోల్బణం భవిష్యత్తు అంచనాలు అనుకూలంగానే ఉన్నాయి. టోకు ద్రవ్యోల్బణం ప్రస్తుత సంవత్సరానికి లక్ష్యం పరిధిలోనే ఉంటుందని అంచనా. భారత ఆర్థిక రంగ వృద్ధి నిలకడగా కొనసాగేందుకు ఉన్న సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కనుక రెపో రేటును పావు శాతం తగ్గించేందుకు నేను ఓటు వేస్తున్నా’’ అని దాస్‌ పేర్కొన్నట్టు నాటి సమావేశం వివరాల ఆధారంగా తెలుస్తోంది. అయినప్పటికీ వృద్ధి, ద్రవ్యోల్బణం తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. You may be interested

11800 వద్ద ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 19th April 2019

విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం 11800ల స్థాయికి అందుకుంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో ఉదయం గం.11:30ని.లకు 11800ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు  గురువారం ముగింపు 11771తో పోలిస్తే 29 పాయింట్ల లాభంతో ఉందనే విషయాన్ని గమనించాలి. ఇక నేడు ఆసియాలోని అన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. తైవాన్‌, కోప్పి, చైనా షాంఘై కాంపోజిట్‌ సూచీలు 0.10శాతం లాభపడ్డాయి. మరోవైపు

నిమిషానికో ఫోన్‌ విక్రయిస్తున్నాం

Friday 19th April 2019

కొత్తగా 150- 200 స్టోర్లు ఏర్పాటు చేస్తాం హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ హ్యాపీ మొబైల్స్‌... సగటున నిముషానికి ఒక స్మార్ట్‌ఫోన్‌ చొప్పున విక్రయిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 50 స్టోర్లతో 5 లక్షల మందికిపైగా కస్టమర్లకు చేరువైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 150- 200 ఔట్‌లెట్లు ప్రారంభిస్తామని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ

Most from this category