STOCKS

News


ఆర్థిక రంగంపై ఎల్లుండి  ప్రధాని సమీక్ష!

Thursday 13th September 2018
news_main1536814556.png-20227

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగంపై ప్రధాని మోదీ శనివారం సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. వేగంగా పడిపోతున్న రూపాయికి కళ్లెం వేసే విషయంలో అవసరమైన చర్యలపైనా చర్చించే అవకాశాలున్నాయని తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, ప్రధాని ఆర్థిక సలహా మండి చైర్మన్‌ బిబేక్‌ దేబ్రాయ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా తదితరులు శనివారం జరిగే సమావేశంలో పాల్గోనున్నారు. రూపాయి 72 స్థాయికి పడిపోయిన సమయంలో ఈ సమావేశం జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థూల ఆర్థిక సంకేతాలు, ప్రభుత్వ ఫైనాన్స్‌, ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపైనా సమీక్ష జరగనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రూపాయి బుధవారం చారిత్రక కనిష్ట స్థాయి 72.91కు పడిపోయిన విషయం విదితమే. కాకపోతే ఆ స్థాయి నుంచి కోలుకుంది. దీంతో కరెంటు ఖాతా లోటుపై ప్రభావం చూపడంతోపాటు, దిగుమతులు మరింత భారం అవుతాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత కొండెక్కే ప్రమాదం కూడా ఉంది. 



You may be interested

చందా కొచర్‌పై చర్యలు తీసుకోవాలి

Thursday 13th September 2018

వదోదర: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వ్యవహారంలో ఆరోపణల నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ఐసీఐసీఐ బ్యాంక్ 24వ వార్షిక సర్వసభ్య సమావేశం వాడి,వేడిగా జరిగింది. అవకతవకలకు పాల్పడ్డారంటూ సీఈవో చందా కొచర్‌పై వచ్చిన ఆరోపణల మీద స్పష్టతనివ్వాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని షేర్‌హోల్డర్లు డిమాండ్ చేశారు. బ్యాంక్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలు, ప్రమాణాలపై కొందరు షేర్‌హోల్డర్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చందా కొచర్‌ ఈ సమావేశానికి హాజరు

బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 13.49 శాతం అప్‌!

Thursday 13th September 2018

ముంబై: బ్యాంకింగ్‌ రుణ వృద్ధి  2018 ఆగస్టు 31వ తేదీతో ముగిసిన పక్షంలో వార్షికంగా 13.49 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. విలువ రూపంలో చూస్తే ఈ మొత్తం రూ.87,89,259 కోట్లు. గత ఏడాది ఇదే పక్షం రోజులకు బ్యాంకింగ్‌ రుణం రూ.77,44,237 కోట్లు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ ఆగస్టు 17తో ముగిసిన పక్షం రోజుల్లో వార్షికంగా రుణ

Most from this category