STOCKS

News


ఈ నెల 26న మైండ్‌ ట్రీ బోర్డ్‌ సమావేశం

Friday 22nd March 2019
news_main1553238624.png-24749

న్యూఢిల్లీ: మైండ్‌ ట్రీ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఈ నెల 26న మరోసారి జరగనున్నది. బుధవారం జరిగిన సమావేశంలో షేర్ల బైబ్యాక్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన డైరెక్టర్ల బోర్డ్‌ ఈ నెల 26న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ కంపెనీని ఎల్‌ అంట్‌టీ బలవంతంగా టేకోవర్‌ చేయాలని ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. మైండ్‌ ట్రీ కంపెనీలో 66 శాతం వాటాను రూ.10,800 కోట్లకు కొనుగోలు చేయడానికి ఎల్‌ అండ్‌ టీ ఆఫర్‌ ఇచ్చింది. మైండ్‌ ట్రీ ప్రమోటర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మైండ్‌ ట్రీ కంపెనీలో కేఫ్‌ కాఫీ డే యజమాని వి.జి. సిద్ధార్థకు 20.32 శాతం వాటా ఉంది. ఈ వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధార్థతో ఎల్‌ అండ్‌ టీ ఒప్పందం కుదుర్చుకుంది. మరో 15 శాతం వాటాకు సమానమైన షేర్లను ఓపెన్‌ మార్కెట్‌​ ద్వారా కొనుగోలు చేయడానికి బ్రోకర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అదనంగా 31 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనున్నది.



You may be interested

ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య ఇండిగో సర్వీస్‌

Friday 22nd March 2019

- 222 సీట్లతో ఏ321నియో విమానం ఇస్తాంబుల్: చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో.. ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య నూతన సర్వీసును ప్రారంభించింది. టర్కీలోని ఈ నగరానికి 222 సీట్లు కలిగిన ఏ321నియో విమానాన్ని కేటాయించింది. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ చేరుకోవడానికి సాధారణంగా ఏడు గంటల సమయం పట్టనుండగా.. పాకిస్తాన్‌ ఎయిర్‌స్పేస్‌ మూసివేసిన కారణంగా ప్రస్తుతానికి పదకొండు గంటల సమయం పడుతుందని సంస్థ ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ తెలిపారు.

’ఫేమ్‌’ కానున్న ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు

Friday 22nd March 2019

సబ్సిడీతో భవిష్యత్‌లో అనూహ్య డిమాండ్‌ 25 శాతం మార్కెట్‌ ఎలక్ట్రిక్‌వేనన్న అంచనా హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల పైచిలుకు త్రీవీలర్లు తయారవుతున్నాయి. ఇందులో సుమారు 65 శాతం వాహనాలు దేశీయంగా అమ్ముడవుతున్నాయి. ఫేమ్‌-2 కింద ఇప్పుడు 5,00,000 ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం ఇవ్వనుండడంతో ఈ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయని కంపెనీలు అంటున్నాయి. ఒక్కో వాహనానికి బ్యాటరీ రకాన్నిబట్టి రూ.50 వేల

Most from this category