STOCKS

News


51శాతం వృద్ధి సాధించిన సూక్ష్మరుణ రంగం

Tuesday 4th December 2018
news_main1543904427.png-22609

న్యూఢిల్లీ:  సూక్ష్మరుణ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో ఈ పరిశ్రమ 51 శాతం వృద్ధి చెందిందని మైక్రో పైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌ (ఎమ్‌ఎఫ్‌ఐఎన్‌) తాజానివేదిక పేర్కొంది. ఈ క్యూ2 నాటికి ఈ రంగం స్థూల రుణ పోర్ట్‌ఫోలియో(జీఎల్‌పీ) రూ.1,46,741 కోట్లని  ఈ నివేదిక పేర్కొంది. ఈ రుణాల్లో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు-సూక్ష్మ రుణ సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీ-ఎమ్‌ఎఫ్‌ఐ) వాటా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉందని వివరించింది. సూక్ష్మరుణ రంగం సంబంధించి ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..,

-ఈ క్యూ2 చివరి నాటికి సూక్ష్మరుణ సంబంధిత ఖాతాల సంఖ్య 27 శాతం వృద్ధితో 7.77 కోట్లకు పెరిగాయి. దీంట్లో ఎన్‌బీఎఫ్‌సీ-ఎమ్‌ఎఫ్‌ఐ వాటా 33 శాతం వృద్ధితో 3.43 కోట్ల ఖాతాలకు ఎగసింది.
-ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి మొత్తం సూక్ష్మ రుణ రంగం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీ-ఎమ్‌ఎఫ్‌ఐల వాటా 37 శాతం(రూ.54,018 కోట్లుగా) ఉంది. రెండో స్థానంలో బ్యాంక్‌లు నిలిచాయి. బ్యాంక్‌ల రుణాలు 33 శాతంగా(రూ.48,200 కోట్లు) ఉన్నాయి.
-మొత్తం సూక్ష్మ రుణాల్లో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల వాటా 17 శాతంగా, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల వాటా 12 శాతంగా ఉంది.
-గత ఏడాది నుంచి సూక్ష్మ రుణ రంగం పోర్ట్‌ఫోలియో ఆరోగ్యకరమైన మెరుగుదలను సాధిస్తోంది. ఇది శుభసూచకం. ఇదే తీరు మరికొన్ని క్వార్టర్ల పాటు కొనసాగనున్నది.



You may be interested

భారత్‌బ్యాంకింగ్‌ అవుట్‌లుకింగ్‌... స్థిరం

Tuesday 4th December 2018

- మూడీస్‌ నివేదిక - వచ్చే 18 నెలలూ ఓకే - ఆరు అంశాల ప్రాతిపదికన రేటింగ్‌ - జీడీపీ వృద్ధి 7.2 శాతంగా అంచనా న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌ను మరో 12 నుంచి 18 నెలలు ‘స్థిరంగా’గా ఉంచుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ- మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. బ్యాంకింగ్‌ రుణ నాణ్యత బలహీనంగా ఉన్నా...  స్థిరంగా ఉందని వివరించింది. ఇందుకు సంబంధించి మూడీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీనియర్‌ క్రెడిట్‌

ఎయిర్‌ ఇండియా ఆస్తుల అమ్మకం

Tuesday 4th December 2018

రూ.9,000 కోట్లు రావచ్చని కేంద్రం అంచనా రుణ భారం తగ్గించేందుకు వరుస నిర్ణయాలు ఎయిర్‌ ఇండియాకు రూ.55,000 కోట్ల రుణాలు గాడిలో పెట్టి, విక్రయించాలన్నది కేంద్రం వ్యూహం న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా రుణ భారం తగ్గించేందుకు కేంద్రం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఎయిర్‌ ఇండియాకు చెందిన భూమి, రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల విక్రయం ద్వారా రూ.9,000 కోట్లను సమీకరించాలన్నది తాజా ప్రతిపాదన. ఎయిర్‌ ఇండియాకు రూ.55,000 కోట్ల మేర రుణ భారం ఉండగా, దీన్ని తగ్గించే

Most from this category