STOCKS

News


మైక్రోఫైనాన్స్ రుణాల్లో 43% వృద్ధి

Tuesday 26th February 2019
news_main1551155963.png-24332

- క్యూ3లో రూ. 1.66 లక్షల కోట్లకు లోన్ పోర్ట్‌ఫోలియో
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో మైక్రోఫైనాన్స్ రంగం రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 1,66,284 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 43.1 శాతం వృద్ధి నమోదు చేసింది. మైక్రోఫైనాన్స్ సంస్థల నెట్‌వర్క్ ఎంఎఫ్‌ఐఎన్‌ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం మైక్రోఫైనాన్స్ ఖాతాలు వార్షిక ప్రాతిపదికన 24.3 శాతం పెరిగి 8.91 కోట్లకు చేరాయి. మైక్రో ఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోలో బ్యాంక్‌యేతర ఆర్థిక సంస్థల కోవకి చెందిన సూక్ష్మ రుణాల సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐ) వాటా రూ. 60,631 కోట్లుగా (36.5 శాతం) ఉంది. "మైక్రోఫైనాన్స్ సంస్థలు జరిపే రుణాల వితరణలో సుమారు 81 శాతం లావాదేవీలు నగదు రహిత విధానంలో ఉంటున్నాయి. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐలైతే ఏకంగా 100 శాతం నగదురహిత విధానంలో రుణాల వితరణ నమోదు చేశాయి" అని ఎంఎఫ్‌ఐఎన్‌ సీఈవో హర్ష్ శ్రీవాస్తవ తెలిపారు. 50 ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐలు అక్టోబర్‌-డిసెంబర్ మధ్యకాలంలో 77 లక్షల ఖాతాదారులకు రూ. 19,1999 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. రుణ వితరణ కార్యకలాపాలు కోసం రూ. 8,235 కోట్లు సమీకరించాయి. 

అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో ...
నివేదిక ప్రకారం తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐల రుణాల పోర్ట్‌ఫోలియో అత్యధికంగా కేంద్రీకృతమై ఉంది. ఇక దక్షిణాది వాటా 25 శాతం కాగా, ఉత్తరాది 14 శాతం, పశ్చిమ రాష్ట్రాలు 15 శాతం, మధ్య భారతంలో 9 శాతంగా ఉంది. మొత్తం సూక్ష్మ రుణాల రంగంలో ఎన్‌బీఎఫ్‌సీ-ఎ౾ంఎఫ్‌ఐల వాటా 36.5 శాతంగా, బ్యాంకులది 32.2 శాతంగా, చిన్న ఫైనాన్స్ బ్యాంకులది 18.2 శాతంగా, ఎన్‌బీఎఫ్‌సీలది 10.7 శాతంగా, లాభాపేక్ష లేని ఎంఎఫ్‌ఐల వాటా 2.4 శాతంగా ఉంది.



You may be interested

భారత ఆర్థిక వ్యవస్థ అసంఘటితమైనది..

Tuesday 26th February 2019

ఉద్యోగాలపై సరైన డేటా లేకపోవడానికి కారణమదే ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్‌ న్యూఢిల్లీ:  భారత ఆర్థిక వ్యవస్థ అసంఘటితంగా ఉండటం వల్ల ఉద్యోగాల కల్పన, ఎకానమీపై సరైన గణాంకాలు లభించడం కష్టమని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ హయాంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరిగిందంటూ ఒకవైపు, దేశం వృద్ధి సాధిస్తున్నా ఉద్యోగాలు కరువయ్యాయన్న వార్తలు మరోవైపు వస్తున్న నేపథ్యంలో

జీ వాటా కొనుగోలు రేసులో దిగ్గజాలు

Tuesday 26th February 2019

ముంబై: జీ ఎంటర్‌టైన్మెంట్‌లో వాటా కొనుగోలు కోసం అంతర్జాతీయంగా పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాకు చెందిన కేబుల్‌ దిగ్గజం, కామ్‌కాస్ట్‌(అమెరికాలో ఎన్‌బీసీ యూనివర్శల్‌ సంస్థను నిర్వహిస్తోంది), కామ్‌కాస్ట్‌ మాజీ సీఎఫ్‌ఓ మైకేల్‌ ఏంజెలాకిస్‌ నేత్వత్వంలోని 400 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, ఎటైర్స్‌,  సోనీ కార్ప్‌లను జీ కంపెనీ చర్చల నిమిత్తం షార్ట్‌లిస్ట్‌ చేసిందని సమాచారం.టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌,  భారత చమురు దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (జీ ఎంటర్‌టైన్మెంట్‌లో వాటా

Most from this category