STOCKS

News


ఫండ్స్‌ నుంచి బ్యాంకుల్లోకి రూ.2 లక్షల కోట్లు

Saturday 27th October 2018
news_main1540610584.png-21519

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ సంక్షోభం తర్వాత ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఉపసంహరించుకోగా... ఇవి బ్యాంకుల్లోకి చేరాయి. ఈ నిధులు ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) మద్దతుగా నిలుస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఈ విషయాన్ని ఒక నివేదికలో తెలియజేశారు. ‘‘ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్‌, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి ఈ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకున్నారు. ఈ స్థాయిలో భారీగా వచ్చిన డిపాజిట్లను బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి నాణ్యమైన ఆస్తుల కొనుగోలుకు వినియోగించే అవకాశముంది. ఎక్కువ శాతం ఇదే జరగొచ్చు కూడా. దీంతో లిక్విడిటీకి సంబంధించిన ఆందోళనలు సమసిపోతాయి’’ అని ఈ నివేదిక పేర్కొంది. బ్యాంకులు ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఆస్తులు కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరించిన విషయాన్ని గుర్తు చేసింది. ఎస్‌బీఐ అయితే, లిక్విడిటీ సమస్యకు పరిష్కారంగా మూడు రెట్లు అధికంగా రూ.45,000 కోట్ల వరకు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఆస్తుల కొనుగోలుకు సిద్ధమని ప్రకటించింది. లిక్విడిటీకి కొరత ఏర్పడితే మాత్రం కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ రుణాలు, చిన్న వ్యాపారులు, హౌసింగ్‌ రుణాలపై ప్రభావం ఉంటుందని, ఈ వర్గాలకిచ్చే రుణాలు తగ్గిపోతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ అంశంపై విధాన నిర్ణేతలు స్పందించడంతో, అది వ్యవస్థాగత సమస్యగా మారకపోవచ్చని కూడా ఈ నివేదిక అభిప్రాయపడింది. స్వల్ప కాలంలో నమ్మకం పరమైన సమస్య ఉంటుందని, అనిశ్చిత పరిస్థితులు మార్కెట్‌పై ప్రభావం చూపించొచ్చని పేర్కొంది. 



You may be interested

ఐటీసీ లాభం రూ.2,955 కోట్లు

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.2,955 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.2,640 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, సిగరెట్లు, వ్యవసాయ, పేపర్‌ విభాగాలు మంచి వృద్ధి సాధించాయని కంపెనీ తెలియజేసింది. స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన గత క్యూ2లో రూ.10,258

ఆర్‌బీఐకి పటిష్టమైన స్వతంత్రత అవసరం: విరాళ్‌ ఆచార్య

Saturday 27th October 2018

ముంబై: ఆర్‌బీఐకి మరింత పటిష్టమైన స్వతంత్రత అవసరాన్ని ఆ సంస్థ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య గుర్తు చేశారు. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వాలు గుర్తించకపోతే... త్వరలోనే లేదా తర్వాత అయినా ఫైనాన్షియల్‌ మార్కెట్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని, ఆర్థిక మంటలకు దారితీస్తుందన్నారు. సెంట్రల్‌ బ్యాంకు స్వతంత్రతను తగ్గించే ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వానికి సెల్ఫ్‌గోల్‌ (తాను తీసుకున్న గోతిలో తానే పడడం) అవుతుందన్నారు. ఏడీ ష్రాఫ్‌ స్మారక ఉపన్యాసంలో

Most from this category