STOCKS

News


గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి?

Tuesday 20th November 2018
news_main1542684907.png-22205

న్యూఢిల్లీ: దేశంలో విక్రయించే బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆహారం, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ తప్పనిసరికాదు. హాల్‌మార్కింగ్‌ అనేది విలువైన మెటల్‌కు ఒక స్వచ్చత ధ్రువీకరణ పత్రం. వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ నియంత్రణలోనే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెర్ట్స్‌ (బీఐఎస్‌) హాల్‌మార్కింగ్‌ నిర్వహణాపరమైన అధికారాన్ని కలిగి ఉంది. వరల్డ్‌ స్టాండెర్ట్స్‌ డేను పురస్కరించుకుని ‘అంతర్జాతీయ ప్రమాణాలు, నాల్గవ పారిశ్రామిక విప్లవం’ అన్న పేరుతో ఇక్కడ బీఐఎస్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాశ్వాన్‌ మాట్లాడారు.  ఈ సందర్బంగా పాశ్వాన్‌ ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
♦ 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు.. ఇలా మూడు గ్రేడ్లకు సంబంధించిన పసిడి ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ ప్రమాణాలను బీఐఎస్‌ రూపొందించింది. త్వరలో పసిడి హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయబోతున్నాం.
♦ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు తగిన ప్రమాణాలు అవసరమన్న ఆయన హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి ఎప్పటి నుంచీ అమల్లోకి వచ్చేదీ మాత్రం వెల్లడించలేదు. 
♦ భారత్‌లో 220 బీఐఎస్‌ గుర్తింపు పొందిన  హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో అత్యధికంగా తమిళనాడు, కేరళలో మాత్రమే ఉండడం గమనార్హం. 
♦ నాల్గవ పారిశ్రామిక విప్లవాన్ని మంత్రి ‘స్మార్ట్‌ టెక్నాలజీ’కి సంబంధించిన అంశాలుగా మంత్రి అభివర్ణించారు. దేశంలో వినియోగవస్తువుల ప్రమాణాలకు సంబంధించి బీఐఎస్‌ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. 
♦ ఈ సందర్భంగా మంత్రి ఆధునికీకరించిన బీఐఎస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అలాగే స్మార్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ప్రమాణాల నివేదికను ఆవిష్కరించారు. 
♦ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వంటి క్తొత స్మార్ట్‌ టెక్నాలజీస్‌కు ప్రమాణాలు నిర్దేశించాల్సిన అవసరం ఉందని వినియోగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి సీఆర్‌ చౌదరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
♦ స్మార్ట్‌ టెక్నాలజీస్‌లో ప్రమాణాల స్థిరీకరణపై అధ్యయనం చేయడానికి ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసినట్లు బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ సురినా రాజన్‌ వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రమాణాలను పెంపొందించడం భారత్‌కు ఒక పెద్ద సవాలని కూడా ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. 



You may be interested

రూపాయికి శుభ ‘అంచనా’!

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి పయనం ఎటు వెళుతుందోనన్న ఆర్థిక వర్గాల అంచనా, ఆందోళనల నేపథ్యంలో- ప్రముఖ ఆర్థిక సేవల దిగ్గజం సిటీగ్రూప్‌ అమెరికా డాలర్‌ కదలికకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 2019లో డాలర్‌ గరిష్ట పరిమితికి చేరుతుందని, అటు తర్వాత వెనక్కు తిరిగే అవకాశం ఉందని సిటీగ్రూప్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇదే జరిగితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న భారత్‌ రూపాయికి ఇది శుభవార్తే. సిటీగ్రూప్‌

రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం ఎన్‌ఎస్‌ఈ ‘జీ-సెక్‌’ ప్లాట్‌ఫామ్‌

Tuesday 20th November 2018

ముంబై: రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీలను సులభంగా కొనుగోలు చేయటానికి వీలుగా ఎన్‌ఎస్‌ఈ వెబ్‌ పోర్టల్‌తో పాటు మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఎన్‌ఎస్‌ఈ గోబిడ్‌’ పేరిట రూపొందించిన ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను సెబీ చైర్మన్‌ అజయ్‌త్యాగి సోమవారం ముంబైలో ఆవిష్కరించారు. ట్రెజరీ బిల్లులు 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల కాల వ్యవధి కోసం, ఇతర ప్రభుత్వ బాండ్లలో (ఏడాది నుంచి 40 ఏళ్ల కాల

Most from this category