STOCKS

News


రూపాయి ఉండాల్సింది 71 స్థాయి వద్ద!

Tuesday 7th August 2018
news_main1533625889.png-19009

కౌశిక్‌ బసు
రూపాయి ఇప్పటికీ ఓవర్‌ వాల్యూడ్‌గా ఉందని, డాలర్‌తో పోలిస్తే 70- 71 స్థాయి వద్ద రూపాయికి ఫెయిర్‌వాల్యూ అని ప్రముఖ ఎకనమిస్టు, ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది వర్ధమాన ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి అధ్వాన్న ప్రదర్శన చూపిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ రేట్లు పెంచడం, క్యాడ్‌ విస్తరించడం... రూపాయిని కుంగదీశాయి. ప్రస్తుతం రూపాయి 68- 69 స్థాయిల వద్ద కదలాడుతోంది. గత రెండు నెలల్లో రూపాయి పలుమార్లు 70 స్థాయిని తాకి రీబౌండ్‌ అయింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీలో క్యాడ్‌ 1.9 శాతాన్ని చేరింది. దీంతో పాటు స్వల్పకాలిక రుణభారం రెండింతలైంది. మరోవైపు ప్రపంచ వాణిజ్యం రక్షణాత్మక విధానాల దిశగా కదులుతోంది. దేశ ఫారెక్స్‌ నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవన్నీ నాణేనికి ఒక పక్క కాగా మరోపక్క దేశీయ ఈక్విటీలు గరిష్ఠాలు నమోదు చేసుకుంటూ కదం తొక్కుతున్నాయి. జూలైలో ఎఫ్‌పీఐలు రూ.2300 కోట్ల రూపాయలను ఈక్విటీల్లో పెట్టుబడిగా పెట్టాయి. పారిశ్రామిక దేశాల కన్నా మనవద్ద ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోందని బసు చెప్పారు. గత రెండు నెలల కరెక‌్షన్‌ నుంచి రూపాయి క్రమంగా బలపడుతోందని, అయితే నిజానికి రూపాయికి కరెక్ట్‌ స్థానం 70- 71వద్దనేనని అన్నారు. 
నిరుద్యోగమే ఆందోళనకరం
దేశంలో అనుకున్న స్థాయిలో ఉపాధికల్పన జరగకపోవడమే అతిపెద్ద ఆందోళనకరమైన అంశమని బసు హెచ్చరించారు. దేశీయ జాబ్స్‌ డేటా చాలా పేలవంగా ఉందన్నారు. పశ్చిమదేశాలతో పోలిస్తే మనవద్ద ‘వర్క్‌’కు నిర్వచనం వేరన్నారు. అందువల్ల గణాంకాల గణనకు ఆ దేశాల పద‍్ధతులు మనకు పనికిరావన్నారు. మనవద్ద వినిమయం, ధరలు తదితర గణాంకాల సేకరణ బాగుందని, జాబ్స్‌ డేటా కలెక‌్షన్‌ బాగాలేదని చెప్పారు. దేశంలో పెరుగుతున్న అసహనం మంచిదికాదని ఆయన హితవు చెప్పారు. ప్రపంచీకరణను తుడిచివేయడం జరిగే పనికాదని బసు అన్నారు. గ్లోబలైజేషన్‌తో లాభాలు పొందిన కార్పొరేట్‌ సంస్థలు తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రపంచీకరణను కాపాడాల్సిఉందని సూచించారు. You may be interested

నష్టాల బాటలో అదానీ షేర్లు

Tuesday 7th August 2018

ముంబై:- తొలి త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రం నమోదు కావడంతో మంగళవారం అదానీ గ్రూప్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో ఈ గ్రూప్‌ షేర్లలో అమ్మకాలకు తెరలేచింది. ఫలితంగా ఈ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 6 నుంచి 12శాతం నష్టపోయాయి. అదానీ పోర్ట్స్‌:- ఎన్‌ఎస్‌ఈలో 6.50శాతం నష్టపోయింది. తొలి త్రైమాసికంలో నికర లాభం 9శాతం క్షీణించింది. ఈ

నష్టాల్లోకి మార్కెట్‌..

Tuesday 7th August 2018

స్టాక్‌ మార్కెట్‌ లాభాలు ఆవిరైపోయాయి. మంగళవారం సరికొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద ప్రారంభమైన మార్కెట్లు.. ఆ తర్వాత మళ్లీ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. మార్నింగ్‌ సెషన్‌లో సెనెక్స్‌ 37,840 మార్క్‌కు పైన, నిఫ్టీ 11,420 మార్క్‌కు పైగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 37,849 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11,423 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా డౌన్‌ లాభాల్లో ప్రారంభమైన

Most from this category