STOCKS

News


నేటి నుంచి జెట్ పైలట్ల సమ్మె

Monday 15th April 2019
Markets_main1555307383.png-25132

ముంబై: జీతాల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ పైలట్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఉదయం 10 గం.ల నుంచి విమానాలను నడపరాదని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 1,100 పైలట్లు ఇందులో పాల్గొనున్నట్లు పేర్కొన్నాయి. "మూడున్నర నెలలుగా మాకు జీతాలు అందడం లేదు. అందుకే ఏప్రిల్ 15 నుంచి విమానాలు నడపరాదని నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్‌ఏజీ)లోని మొత్తం 1,100 పైలట్లు సోమవారం ఉదయం 10. గం.ల నుంచి విమానాలు నడపబోరు" అని ఎన్‌ఏజీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచే నిలిపివేయాలని ముందుగా భావించినప్పటికీ .. కొత్త యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ తర్వాత ఏప్రిల్ 15 దాకా వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి. రూ. 8,000 కోట్ల పైగా రుణభారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని కన్సార్షియం తన చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 
విదేశీ విమానాల రద్దు...
ఆగ్నేయాసియా ప్రాంతాలు, సార్క్‌ దేశాలకు నడిపే విమానాలను నిరవధికంగా రద్దు చేసినట్లు జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. అటు టొరంటో, ప్యారిస్‌, ఆమ్‌స్టర్‌డామ్‌, లండన్ హీత్రో వంటి ఇతర విదేశీ రూట్లలో సర్వీసుల నిలిపివేతను ఏప్రిల్ 16 దాకా (మంగళవారం) పొడిగించినట్లు పేర్కొంది. జూన్‌ 10 దాకా ముంబై-ప్యారిస్ విమాన సర్వీసులకు జెట్ ఇప్పటికే బుకింగ్స్‌ను నిలిపివేసింది. అలాగే ముంబై, బెంగళూరు నుంచి లండన్‌, ఆమ్‌స్టర్‌డామ్‌కి నడిపే సర్వీసులకు కూడా ఏప్రిల్ 18 దాకా బుకింగ్స్‌ను నిలిపివేసింది.



You may be interested

రెండేళ్లలో అనుసంధానం పూర్తి

Monday 15th April 2019

రెండేళ్లలో అనుసంధానం పూర్తి దేనా బ్యాంకు, విజయబ్యాంకుల విలీనంపై బీవోబీ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు ఆఫ్‌ బరోడాలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు విలీనం కాగా, వీటి మధ్య అనుసంధానత రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంకు ఆఫ్‌ బరోడా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు బ్యాంకు ఆఫ్‌ బరోడాలో విలీనమై ఒక్కటిగా  మారిన విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ అనుసంధానానికే 12 నెలల

తుది దశలో చైనా-అమెరికా వాణిజ్య చర్చలు

Monday 15th April 2019

వాషింగ్టన్‌: వాణిజ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి అమెరికా - చైనా మధ్య చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఒప్పందం అమలు తీరుతెన్నులే అన్నింటికన్నా పెద్ద సమస్యగా తయారైందని, ఇది దాదాపు పరిష్కారమైనట్లేనని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మినుచిన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య దాదాపు నలభై ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక బంధంలో ఇది పెద్ద మార్పు తేగలదని ఆయన పేర్కొన్నారు. "వివాదాల పరిష్కార సాధనలో తుది దశకు

Most from this category