STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి డిస్కౌంట్‌ టికెట్లు

Thursday 6th December 2018
news_main1544075387.png-22688

ముంబై: విమానయాన సంస్థ, జెట్‌ ఎయిర్‌వేస్‌ డిస్కౌంట్‌ ధరలకే విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన మార్గాల్లో బేస్‌ ధరల్లో 30 శాతం వరకూ డిస్కౌంట్‌నిస్తున్నామని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది.  బుధవారం ఆరంభమైన ఈ ఆఫర్‌ ఏడు రోజుల పాటు అమల్లో ఉంటుందని పేర్కొంది. బిజినెస్‌, ఎకానమీ క్లాస్‌ బుకింగ్‌లకు ఈ డిస్కౌంట్‌ ధరలు చెల్లుబాటవుతాయని, తమ భాగస్వామ్య సంస్థలు నిర్వహించే కోడ్‌ షేరింగ్‌ విమాన సర్వీసులకు కూడా ఈ డిస్కౌంట్‌ ధరలు వర్తిస్తాయని తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా బుక్‌ చేసుకున్న టికెట్లను ఈ నెల 5 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30లోపు జరిపే ప్రయాణాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. 



You may be interested

5జీపై టెలికం శాఖతో చర్చల్లో క్వాల్‌కామ్‌

Thursday 6th December 2018

హవాయ్:   భారత్‌లో 5జీ టెలికం సర్వీసుల విస్తృతికి అపార అవకాశాలు ఉన్నాయని మొబైల్ చిప్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్ టెక్నాలజీస్ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ దుర్గా మల్లాది తెలిపారు. 5జీతో అవకాశాలపై దేశీయంగా మరింత అవగాహన కల్పించేందుకు తీసుకోతగిన చర్యలపై టెలికం శాఖతో పాటు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. 5జీ సర్వీసులు వచ్చినంత మాత్రాన 4జీ ఎల్‌టీఈ సేవలు పూర్తిగా

సాగర్‌ సిమెంట్స్‌ భారీ విస్తరణ

Thursday 6th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్‌ సిమెంట్స్‌ భారీగా విస్తరిస్తోంది. 2021 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 8.25 మిలియన్‌ టన్నులకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థ సామర్థ్యం 5.75 మిలియన్‌ టన్నులు. విస్తరణలో భాగంగా మిలియన్‌ టన్ను సామర్థ్యం గల ప్లాంటును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వద్ద నెలకొల్పనుంది. ఇందుకోసం రూ.150 కోట్లను సద్గురు సిమెంట్‌లో (ఎస్‌సీపీఎల్‌) పెట్టుబడిగా పెట్టనుంది. అలాగే వేస్ట్‌ హీట్‌ రికవరీ పవర్‌ ప్రాజెక్టును రూ.426

Most from this category