రెండు మూడు అంశాల్లో ఆర్బీఐతో విభేదాలు
By Sakshi

ముంబై: రెండు మూడు విషయాల్లో ఆర్బీఐతో ప్రభుత్వానికి అంతరాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. ఆర్బీఐ పనితీరుపై చర్చను దెబ్బతీయడంగా ఎలా అభివర్ణిస్తారని జైట్లీ ప్రశ్నించారు. రాజకీయ పరమైన ఒత్తిళ్ల కారణంగానే ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో... గతంలోనూ ప్రభుత్వాలు ఈ తరహా చర్యలు తీసుకున్న ఉదంతాలున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రధానులు నెహ్రూ, ఇందిరిగాంధీ ఆర్బీఐ గవర్నర్లను రాజీనామా చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ముంబైలో టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన భారత ఆర్థిక సదస్సుకు హాజరైన సందర్భంగా జైట్లీ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో రుణాల లభ్యత, ద్రవ్యపరమైన మద్దతు విషయాల్లో ఆర్బీఐతో విభేదాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. ప్రభుత్వం తన ఆందోళనలను తెలియజేసేందుకు చర్చలను ప్రారంభించినట్టు తెలిపారు. ఓ కీలకమైన సంస్థగా ఆర్బీఐతో చర్చలు జరపడం దెబ్బతీయడం అవుతుందా? అని ప్రశ్నించారు. ‘‘మాది సౌర్వభౌమ ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో చాలా ముఖ్యమైన భాగస్వాములం’’ అని జైట్లీ అభివర్ణించారు. రుణాలు, లిక్విడిటీ విషయంలో ఆర్బీఐపై బాధ్యత ఉందన్నారు.
You may be interested
పీసీఏ, ఒక్కరోజు ఎగవేత నిబంధనలు సడలించండి
Friday 14th December 2018ముంబై: ఆర్బీఐ నూతన గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ముంబైలో ప్రభుత్వరంగ బ్యాంకుల సారథులతో భేటీ అయ్యారు. అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ అనుసరిస్తున్న కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ), రుణ చెల్లింపుల్లో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరించడమనే నిబంధనలను సడలించాలని ఈ సందర్భంగా ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులు కోరారు. అలాగే, బ్యాంకులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై దాస్తోపాటు ఆర్బీఐకి చెందిన నలుగురు
వారం కనిష్టానికి పసిడి
Friday 14th December 2018ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం వారం కనిష్టస్థాయి వద్ద కదలాడుతోంది. ఆసియాలో ఉదయం గం.10:00లకు ఔన్స్ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1246.40డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.గత రాత్రి అమెరికా మార్కెట్లో డాలర్ బలపడటంతో అక్కడి మార్కెట్లో పసిడి ధర వారం రోజుల కనిష్టానికి తగ్గింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వచ్చే ఏడాదికాలానికి వృద్ధిరేటును, ద్రవ్యోల్బణ అంచనాలకు తగ్గించడంతో యూరో బలహీనపడింది. ఇది డాలర్ బలపడటానికి కారణమైంది. ‘‘ఈసీబీ అధ్యక్షుడు