STOCKS

News


అంబానీలు ఏం చేసినా ప్రత్యేకమే!!

Saturday 8th December 2018
news_main1544266651.png-22774

  • 5,000పైగా మందికి అన్నదాన కార్యక్రమం

ఇతరుల సంతోషాన్ని కోరుకుంటే.. దేవుడు మనకు కూడా మంచే చేస్తాడని ఎక్కువ మంది విశ్వసిస్తుంటారు. దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ కూడా ఇలాగే అనుకున్నట్లున్నారు. అందుకేనేమో.. తన గారాలాపట్టీ ఇషా ముందస్తు పెళ్లి వేడుకులను అన్నదాన కార్యక్రమంతో ఎంతో ఘనంగా ఆరంభించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంబానీ కుటుంబ సభ్యులు శుక్రవారం రోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 5,100 మందికి కడుపు నిండా అన్నం పెట్టారు. ఇషా అంబానీ, నీతా అంబానీ, ముకేశ్‌ అంబానీలు పలువురికి స్వయంగా వడ్డించారు. అన్నదానం ఒక్క రోజుతో అయిపోలేదు. డిసెంబర్‌ 7 నుంచి 10 వరకు అంటే 4 రోజుల పాటు మూడు పూటల అన్నదానం చేయనున్నారు. ఈ విధంగా అంబానీ కుటుంబం ఉదయ్‌పూర్‌ వాసుల ఆశీర్వాదాలు తీసుకుంటోంది.  
ఇకపోతే ఇషా అంబానీ- ఆనంద్‌ పిరమాల్‌ వివాహం డిసెంబర్ 12న ముంబయిలో అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది. 
అంబానీ కుటుంబం అన్నదానంతో పాటు భారతీయ వస్తు కళలను ప్రమోట్ చేసేందుకు స్వదేశీ బజార్‌ పేరుతో ఒక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశీయ కళా నైపుణ్యాలను ఇందులో ప్రదర్శిస్తారు. దీని వల్ల స్థానిక వ్యాపారులకు లాభం చేకూరనుంది. ఈ ఎగ్జిబిషన్‌కు దేశీ, విదేశీ ప్రముఖులు తరలిరానున్నారు. You may be interested

5నెలల గరిష్టానికి పసిడి ధర

Saturday 8th December 2018

ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల పెంపుపై అనుమానాలు రేకెత్తడంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం 5నెలల గరిష్టానికి చేరుకుంది. రాత్రి అమెరికా విడుదల చేసిన నవంబర్‌ నిరుద్యోగ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈ నెలలో 195,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆర్ధికవేత్తలు అంచనావేయగా, కేవలం 155,000 ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగినట్లు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ గణాంకాలను విడుదల చేసింది. వ్యవస్థలో ఉపాధి కల్పన మందిగించడంతో

రికమండేషన్‌ అష్టపది

Saturday 8th December 2018

వచ్చే సంవత్సర కాలానికి మంచి రాబడిని అందించే షేర్లు ఎనిమిది రంగాల్లో లభిస్తాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ చెబుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రంగాలను, వీటిలోని నాణ్యమైన స్టాకులను ఎంచుకోవాలని సూచిస్తోంది.  1. అటోమొబైల్స్‌: క్రూడాయిల్‌ ధరలు తగ్గడం బాగా కలిసిరానుంది. చాలా స్టాకులు ఆకర్షణీయమైన వాల్యూషన్లకు చేరుతున్నాయి. ముడిపదార్ధాల ధరల్లో స్థిరత్వం వస్తే మరింత దూసుకుపోనుంది. 2. ఆటో విడిభాగాలు: విడిభాగాల డిమాండ్‌, వాల్యూంల్లో వృద్ది ఆరోగ్యకరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టైర్ల కంపెనీల

Most from this category