STOCKS

News


భారత్‌లో పెట్టుబడులు పెంచండి

Friday 23rd November 2018
news_main1542949132.png-22337

మెల్‌బోర్న్‌: భారత్‌లో పెట్టుబడులు పెంచాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. భారత్‌లో ఆస్ట్రేలియా పెట్టుబడులు కనిపించేంత లేవని, ఈ అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. పెట్టుబడులపై గణనీయమైన రాబడులకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ సమక్షంలో మెల్‌బోర్న్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ పారిశ్రామిక సమూహాన్ని ఉద్దేశించి భారత రాష్ట్రపతి మాట్లాడారు. రెండు దేశాలూ పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఆర్థికం, రవాణా, పారిశ్రామిక డిజైన్‌, బయోటెక్‌, క్యాపిటల్‌ మార్కెట్స్‌, సాగు, ఆహారం, అంతరిక్ష టెక్నాలజీ రంగాల్లో ప్రయోజనం పొందేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. భారత మార్కెట్‌లో భారీ సంఖ్యలో వినియోగదారులు ఉన్న విషయాన్ని తెలియజేస్తూ పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడులు పొందొచ్చన్నారు. క్యాన్‌బెరాలోని భారత ఎంబసీ వద్దనున్న సమాచారం మేరకు... రెండు దేశాల మధ్య 2003-04లో ద్వైపాక్షిక వాణిజ్యం 6.54 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా, 2015-16 నాటికి ఇది 19.29 డాలర్లకు పెరిగింది.
మౌలిక రంగంలో పెట్టుబడులు
లక్షల కోట్ల డాలర్ల ఆస్ట్రేలియా సూపర్‌ ఫండ్‌ పరిశ్రమ భారత మౌలిక రంగంలో ఇన్వెస్ట్‌ చేయాలని, ఇది ఇద్దరికీ లాభదాయకమైనదని రామ్‌నాథ్‌ కోవింగ్‌ అన్నారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల వాణిజ్య స్థాయి పెరగాలంటూనే... పరస్పరం ప్రయోజనం పొందే ఆర్థిక సహకారాన్ని భారత్‌ ఆశిస్తోందన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌ మాట్లాడుతూ... ఇటీవలే ప్రారంభించిన భారత ఆర్థిక వ్యూహాన్ని తాము ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. తన పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. 



You may be interested

అపోలో టైర్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: అపోలో టైర్స్‌ కంపెనీకి ఐదేళ్ల పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు అపోలో టైర్స్‌ కంపెనీ సచిన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒక సెలబ్రిటిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా కుదుర్చుకోవడం ఇదే మొదటిసారని అపోలో టైర్స్‌ తెలిపింది. సచిన్‌ టెండూల్కర్‌తో అనుబంధం తమకు ప్రయోజనం కలిగిస్తుందని కంఎనీ వైస్‌ చైర్మన్‌, ఎమ్‌డీ నీరజ్‌ కన్వర్‌ పేర్కొన్నారు. భారత్‌లో ఇండియన్‌ సూపర్‌  లీగ్‌లో చెన్నియన్‌

అక్టోబర్‌లో 13 శాతం పెరిగిన విమాన ట్రాఫిక్‌

Friday 23rd November 2018

ముంబై: దేశీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ వృద్ధి అక్టోబర్‌లో మందగించింది. 13 శాతమే పెరిగింది. 1.18 కోట్ల మంది ప్రయాణించారు. గత 14 నెలల కాలంలోనే ఇది తక్కువని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల మార్కెట్‌ వాటా పరంగా అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ ఇండిగో మాత్రం నాలుగో స్థానంలో ఉంది. ఈ ఏడాది జనవరి- అక్టోబర్‌ వరకు చూస్తే ప్రయాణికుల డిమాండ్‌ 20.11 శాతం పెరిగింది.

Most from this category