STOCKS

News


రూ.29వేల కోట్లకు నిర్మాణ యంత్రాల మార్కెట్‌

Thursday 22nd November 2018
news_main1542863289.png-22285

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ రంగానికి సంబంధించిన యంత్రాల మార్కెట్‌ దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 90,000 యూనిట్లను దాటుతుందని మెసె మంచెన్‌ ఇండియా కమర్షియల్‌ డైరెక్టర్‌ తుషార్‌ అలేకర్‌ చెప్పారు. బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ‘2016-17లో భారత్‌లో 75,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.29,300 కోట్లు. 2021-22 నాటికిది రూ.56వేల కోట్ల విలువతో 1,23,000 యూనిట్లకు చేరనుంది. పట్టణీకరణ, విదేశీ పెట్టుబడుల రాక, కస్టమైజ్డ్‌ ఎక్విప్‌మెంట్‌కు డిమాండ్‌ పెరుగుతుండడమే ఈ వృద్ధికి కారణం’ అని చెప్పారు. కన్‌స్ట్రక్షన్‌ మెషినరీ, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, మైనింగ్‌ మెషీన్స్‌, కన్‌స్ట్రక్షన్‌ వెహికిల్స్‌ అంతర్జాతీయ ప్రదర్శన ఢిల్లీలో ‘బౌమా కాన్‌ఎక్స్‌పో ఇండియా 2018’ పేరుతో డిసెంబరు 11 నుంచి 14 వరకు జరుగనుంది. 700 కంపెనీల స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. 
తెలంగాణ ముందంజ..
రోడ్డు ప్రాజెక్టులకు చేస్తున్న వ్యయంలో ఏపీతో పోలిస్తే తెలంగాణ ముందంజలో ఉంది. ‘ఉమ్మడి రాష్ట్రంలో అయిదేళ్ల కాలంలో రోడ్డు నిర్మాణాలకు రూ.3,000 కోట్లు కేటాయించారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రూ.23,000 కోట్లు ఖర్చు చేస్తోంది. అదే ఆంధ్రప్రదేశ్‌ కేవలం రూ.10,000 కోట్లకు పరిమితమైంది’ అని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ చైర్మన్‌ డీవీఎన్‌ రెడ్డి వెల్లడించారు. మీడియా సమావేశంలో అసోసియేషన్‌ వైస్‌ చైర్మన్‌ అనిరుధ్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. 



You may be interested

మార్చికి సగం ఏటీఎంల మూత

Thursday 22nd November 2018

ముంబై: దేశంలో ఉన్న 2.38 లక్షల ఏటీఎంలలో సగం మేర వచ్చే మార్చి నాటికి మూతపడే పరిస్థితి నెలకొందని ఏటీఎం పరిశ్రమ సమాఖ్య (క్యాట్‌మి) పేర్కొంది. నియంత్రణ పరమైన నిబంధనల్ని మార్చారని, దీనివల్ల ఏటీఎంల నిర్వహణ సాధ్యం కాదని ప్రకటించింది. ఏటీఎంల మూతతో వేల ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విస్తరణ లక్ష్యానికి విఘాతం కలుగుతుందని సమాఖ్య హెచ్చరించింది. ‘‘సర్వీస్‌ ప్రొవైడర్లు 2019 మార్చి

భారత మార్కెట్లోకి డుకాటీ పానిగాల్‌ వీ4ఆర్

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ బైక్ తయారీ దిగ్గజం డుకాటీ తాజాగా పానిగాల్‌ వీ4 ఆర్‌ బైక్‌ను భారత మార్కెట్లో  ఆవిష్కరించింది. దీని ధర రూ. 51.87 లక్షలు (ఎక్స్ షోరూం). భారత్‌లో కేవలం అయిదు బైక్‌లే విక్రయించనున్నామని, దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో వీటిని బుక్ చేసుకోవచ్చని డుకాటీ తెలిపింది. నవంబర్ 30లోగా బుక్ చేసుకుంటే 2019 తొలి త్రైమాసికంలో డెలివరీ ప్రారంభమవుతుందని పేర్కొంది. నవంబర్ తర్వాత బుకింగ్స్‌కు వచ్చే ఏడాది

Most from this category