STOCKS

News


అక్టోబర్‌లో మౌలిక రంగం మందగమనం

Saturday 1st December 2018
news_main1543644612.png-22554

న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ అక్టోబర్‌లో నిరాశపరిచింది. కేవలం 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌ 2017లో ఈ రంగాల వృద్ధి రేటు 5 శాతం. అయితే నెలవారీగా చూస్తే  సెప్టెంబర్‌కన్నా అక్టోబర్‌లో వృద్ధిరేటు పెరిగింది. సెప్టెంబర్‌లో వృద్ధిరేటు 4.3 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో దాదాపు 40 శాతం వాటా ఉన్న ఈ రంగాల ఫలితాలను క్లుప్తంగా చూస్తే...
♦ ఎరువుల పరిశ్రమ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 11.5 శాతం క్షీణించింది. క్రూడ్‌ ఆయిల్‌, సహజ వాయువుల రంగం కూడా 5 శాతం, 0.9 శాతం చొప్పున క్షీణతను నమోదుచేసుకున్నాయి. 
♦ రిఫైనరీ ప్రొడక్టుల క్షీణత రేటు - 7.5 శాతం నుంచి -1.3 శాతానికి తగ్గింది. 
♦  స్టీల్ రంగం వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది. 
♦  బొగ్గు, సిమెంట్‌, విద్యుత్‌ రంగాలు వృద్ధిని సాధించాయి.
ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య
కాగా, ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య 3.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. 



You may be interested

ఏడాదిలో 10 ఐస్ప్రౌట్‌ సెంటర్లు

Saturday 1st December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆఫీస్‌ వర్క్‌స్పేసెస్‌ రంగంలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ఐస్ప్రౌట్‌... కొత్త నగరాలకు విస్తరిస్తోంది. 2019 మార్చిలో చెన్నైలో 210 సీట్ల సామర్థ్యం ఉన్న కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. పుణే, బెంగళూరు, గుర్గావ్‌లోనూ ఆరు నెలల్లో బిజినెస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు సంస్థ కో-ఫౌండర్‌ సుందరి పాటిబండ్ల ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి తెలిపారు. ఇటీవలే విజయవాడలో 12,000 చదరపు అడుగుల

మాల్యా కేసులో బ్యాంకులకు కొంత ఊరట

Saturday 1st December 2018

లండన్‌:  రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా నుంచి బాకీలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశీ బ్యాంకులకు బ్రిటన్ హైకోర్టు కొంత ఊరటనిచ్చింది. మాల్యా విహార నౌక వేలం ద్వారా వచ్చిన నిధుల్లో ఎంతో కొంత బ్యాంకులకు కూడా దఖలుపడేలా ఉత్తర్వులిచ్చింది. వివరాల్లోకి వెడితే.. మాల్యాకు మాల్టా ద్వీప దేశంలో 'ఇండియన్ ఎంప్రెస్‌' అనే విహార నౌక ఉండేది. దీన్ని నిర్వహించే సిబ్బందికి జీతభత్యాలు చెల్లించకపోవడంతో బకాయిలు రాబట్టుకునేందుకు మారిటైమ్

Most from this category