STOCKS

News


నోట్లరద్దు సమాచారం రహస్యమా?

Tuesday 19th February 2019
Markets_main1550560619.png-24253

  • ఆర్‌బీఐని తప్పుబట్టిన కేంద్ర సమాచార కమిషన్‌
  • పొరపాటున అలా చెప్పామన్న రిజర్వు బ్యాంకు

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ఆర్‌బీఐ బోర్డు సమావేశమై ఏం చర్చించిందనేది వెల్లడించడానికి నిరాకరించడాన్ని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తప్పుబట్టింది. ఇదే విషయమై సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌కు సైతం షోకాజు నోటీసు జారీ చేసింది. డీమోనిటైజేషన్‌ నిర్ణయానికి ముందు... అందుకు సంబంధించి జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం వివరాలు, డాక్యుమెంట్ల సమాచారాన్ని ఇవ్వాలని కార్యకర్త వెంకటేష్‌ నాయక్‌ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద కోరారు. 2016 నవంబర్‌ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఈ వివరాలిచ్చేందుకు ఆర్‌బీఐ నిరాకరించడంతో ఆయన కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ సమచారం వెల్లడికి ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 8 (1) కింద మినహాయింపు ఉందని సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ చెప్పటం సరికాదని ప్రధాన సమాచార కమిషనర్‌ సురేష్‌ చంద్రకు పిటిషనర్‌ తెలిపారు. దేశ సార్వభౌమత, దేశ సమగ్రత, భద్రత, రక్షణ తదితర కీలక అంశాల విషయంలో సమాచారం వెల్లడించకుండా ఈ సెక్షన్‌ మినహాయింపునిస్తోంది. అయితే, సమాచారం వెల్లడికి పొరపాటుగా తిరస్కరించామని, ఆర్‌బీఐ బోర్డు సమావేశం వివరాలను ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నామని ఆర్‌బీఐ ప్రతినిధి విచారణలో తెలియజేశారు. సీపీఐవో హాజరుకాకపోవడంతో ప్రధాన సమాచార కమిషనర్‌ షోకాజు నోటీసు జారీ చేస్తూ, తదుపరి విచారణ తేదీకి హాజరు కావాలని, ఎందుకు జరిమానాకు ఆదేశించరాదో వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించారు.You may be interested

ఎయిర్‌పోర్ట్‌ రంగంలోకి అదానీ!

Tuesday 19th February 2019

 ఆరు విమానాశ్రయాల నిర్వహణ కోసం బిడ్లు ముంబై: విమానాశ్రయాల నిర్వహణ రంగంలోకి ప్రవేశించాలని అదానీ గ్రూప్‌ యోచిస్తోంది. అందుకే ఏఏఐ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ప్రైవేట్‌ పరం చేయనున్న ఆరు విమానాశ్రయాల కోసం బిడ్‌లను దాఖలు చేసింది. ఏఏఐ తన ఆధ్వర్యంలోని ఆరు విమానాశ్రయాలను ప్రైవేట్‌ పరం చేయనుండటం తెలిసిందే. అహ్మదాబాద్‌, జైపూర్‌, లక్నో, త్రివేండ్రం, మంగళూరు, గౌహతిల్లోని విమానాశ్రయా నిర్వహణను ప్రైవేట్‌ రంగానికి అప్పగించనుంది. ఇందుకు గాను బిడ్లను

స్వల్ప లాభాలతో ప్రారంభం

Tuesday 19th February 2019

మిశ్రమ అంతర్జాతీయ ఫలితాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం స్వల్పలాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 55 పాయిం‍ట్ల లాభంతో 35,543 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 10650ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు స్వల్పంగా కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండంతో సూచీల లాభాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఐటీ, ఫార్మా తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు జరుగుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. ఉదయం గం.9:40ని.లకు సెన్సెక్స్‌ 92 పాయింట్లు

Most from this category