News


ద్రవ్యోల్బణం డేటాను ఆధునీకరించాలి

Wednesday 5th December 2018
news_main1543984155.png-22635

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం గణాంకాల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని సత్వరమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు రవీంద్ర ధోలకియా అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ మూడు రోజుల పాలసీ భేటీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ద్రవ్యోల్బణం డేటాపై ధోలకియా ప్రశ్నలు లేవనెత్తారు. ద్రవ్యోల్బణం లెక్కింపునకు సరైన విధానం లేకుండా... ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధిలోనే ఉంచాలన్న కార్యాచరణను ఆర్‌బీఐ అనుసరించడాన్ని ప్రశ్నించారు. ఫిక్స్‌డ్‌ బేస్‌ వెయిట్‌ ఇండెక్స్‌ అన్నది ద్రవ్యోల్బణం లెక్కింపునకు ఉత్తమ విధానం కాదని... చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏటా ఇండెక్స్‌ బేస్‌ను మారుస్తున్నారని తెలియజేశారు. ద్రవ్యోల్బణం నియంత్రిత విధానాన్ని అనుసరించేటప్పుడు... కచ్చితమైన, వాస్తవిక లెక్కింపు విధానాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆర్బీఐ ఎంపీసీ కమిటీలో స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించే సభ్యుడిగా ధోలకియాకు పేరుంది. ఆగస్ట్‌లో జరిగిన పాలసీ భేటీలో రెపో రేటును పావుశాతం పెంచగా, నాడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ధోలకియా ఓటు వేయడం గమనార్హం. 
నేడే ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలు
ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెల్లడి కానున్నాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ త్రైమాసికంలో 7.1 శాతానికి క్షీణించడం, అదే సమయంలో ద్రవ్యోల్బణం 3.31 శాతం కనిష్టానికి చేరడం వంటి అంశాల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ విడత కూడా తటస్థ విధానాన్నే అనుసరించొచ్చన్నది విశ్లేషకుల అంచనాగా ఉంది. వచ్చే మార్చి నాటికి ద్రవ్యోల్బణం 3.9-4.5 శాతం స్థాయిలోఉండొచ్చన్న అంచనాను ఆర్‌బీఐ గతంలో ప్రకటించింది. అలాగే, 2018-19 వృద్ధి రేటును 7.4-7.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ అంచనాలను తగ్గించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. You may be interested

ప్రతీ ఆరు నెలలకో కొత్త మోడల్‌

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజ కంపెనీ కియా మోటార్స్‌ వచ్చే ఏడాది జూన్‌ నుంచి భారత్‌లో వాహనాలను విక్రయించనుంది.​ ప్రతి ఆరు నెలలకూ ఒక కొత్త మోడల్‌ చొప్పున మూడేళ్లలో ఆరు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తెస్తామని కియా మోటార్స్‌ ఇండియా సీఈఓ, ఎండీ కుక్‌యున్‌ షిమ్‌ తెలిపారు అమ్మకాలు అధికంగా ఉండే కాంపాక్ట్‌ కార్ల సెగ్మెంట్‌కు ప్రస్తుతం పెద్ద ప్రాధాన్యమివ్వటం లేదన్నారు. మూడేళ్లలో అగ్రశ్రేణి అయిదు

వ్యవసాయోత్పత్తికి కేంద్ర విధానాల ఊతం: జైట్లీ

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తడానికి కాంగ్రెస్ గత ప్రభుత్వ పాలనే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. తమ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక​అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. ఇందుకోసం కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. ‘‘ప్రస్తుతం చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చే రెండు దశాబ్దాల్లో నగరాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా

Most from this category