STOCKS

News


రూ.25 కోట్ల రికవరీకి ఎన్‌సీఎల్‌టీకి ఇండస్‌ఇండ్‌

Wednesday 7th November 2018
news_main1541577570.png-21772

  • ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలో తాజా పరిమాణం

న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ నుంచి రావాల్సిన రూ.25 కోట్ల వడ్డీ రికవరీకి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌)ని ఆశ్రయించింది. ఈ అంశంపై ప్రభుత్వానికి జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇరువురు సభ్యుల ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రధాన కేసు విచారణ జరిగే నవంబర్‌ 13వ తేదీకే ఇండస్‌ఇండ్‌ తాజా పిటిషన్‌పై విచారణనూ వాయిదా వేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా గత నెల ప్రభుత్వం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డ్‌ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌కు భారీ రుణాలను ఇచ్చిన బ్యాంకర్లలో ఇండస్‌ఇండ్‌ ఒకటి. దాదాపు రూ.3,000 కోట్ల రుణాలను బ్యాంక్‌ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌కు మంజూరు చేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణ భారం దాదాపు రూ.30,000 కోట్లు.



You may be interested

పసిడికి అమెరికా ఎన్నికల ఫలితాలు జోష్‌

Wednesday 7th November 2018

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు పసిడి ధరకి ఉత్సాహానిస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం భారత వర్తమానకాలం ప్రకారం మధ్యాహ్నం గం.2.20లకు ఔన్స్‌ పసిడి 8.10డాలర్లు పెరిగి 1,234.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పాలకపక్షమైన రిపబ్లిక్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిని అవలంభిస్తున్నారు. ఫలితాలు ప్రతిపక్షపార్టికి అనుకూలంగా వస్తుడంతో మార్కెట్లో అనిశ్చితి వాతవరణ పరిస్థితలు నెలకొనవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల

ఓల్టాస్‌ లాభం రూ.107 కోట్లు

Wednesday 7th November 2018

- 12 శాతం వృద్ధి - రూమ్‌ ఏసీల్లో 2 శాతం పెరిగిన మార్కెట్‌ వాటా న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన ఓల్టాస్‌ కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 12 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.95 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.107 కోట్లకు పెరిగిందని ఓల్టాస్‌ తెలియజేసింది. కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆదాయం రూ.1,032

Most from this category