STOCKS

News


రూ.90,000 కోట్లు తగ్గనున్న పరోక్ష పన్నుల ఆదాయం

Friday 23rd November 2018
news_main1542948942.png-22335

న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల మేర తగ్గిపోయే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ ఎకోరాప్‌ సంస్థ అంచనా వేసింది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు, అలాగే జీఎస్టీ వసూళ్లు మందగించడం ఇందుకు కారణాలని తన పరిశోధన నివేదికలో తెలియజేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో జీఎస్టీ ద్వారా రూ.7.4 లక్షల కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీల రూపంలో రూ.2.6 లక్షల కోట్ల ఆదాయం రానుందని కేంద్రం అంచనా వేసింది. బడ్జెట్‌ అంచనాలు రూ.7.44 లక్షల కోట్ల మేర ఉండగా, మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.6.78 లక్షల కోట్ల వరకు రానున్నట్టు ఎస్‌బీఐ ఎకోరాప్‌ పేర్కొంది. ఇక వరుసగా రెండో ఏడాది ప్రత్యక్ష పన్నుల ఆదాయం బడ్జెట్‌ అంచనాల కంటే రూ.20,000 కోట్ల మేర అధికంగా ఉంటుందని, రుణ ఎగవేతల కిట్టీ నుంచి ప్రభుత్వం మరో రూ.20,000 కోట్లు సమకూర్చుకుంటుందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ‘‘చమురు ధరలు ఇటీవల తగ్గడం వల్ల కరెంటు ఖాతా లోటు రూ.5-6 బిలియన్‌ డాలర్ల మేర తగ్గుతుంది. మా అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 78 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చు. జీడీపీలో 2.6 శాతంగా ఉంటుంది. దీనికి అదనంగా చమురు ధరలు సగటున 65 డాలర్ల స్థాయిలో ఉండి, రూపాయి డాలర్‌తో 70 స్థాయిలో స్థిరపడితే... పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌కు రూ.4 తగ్గొచ్చు. దీంతో డీజిల్‌ లీటర్‌ ధర రూ.70లోపునకు, పెట్రోల్‌ రూ.75లోపునకు దిగొస్తాయి. వచ్చే కొన్ని నెలల పాటు ద్రవ్యోల్బణం 2.7-2.8 శాతానికి చేరొచ్చు’’ అని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదిక తెలియజేసింది.



You may be interested

అక్టోబర్‌లో 13 శాతం పెరిగిన విమాన ట్రాఫిక్‌

Friday 23rd November 2018

ముంబై: దేశీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ వృద్ధి అక్టోబర్‌లో మందగించింది. 13 శాతమే పెరిగింది. 1.18 కోట్ల మంది ప్రయాణించారు. గత 14 నెలల కాలంలోనే ఇది తక్కువని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల మార్కెట్‌ వాటా పరంగా అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ ఇండిగో మాత్రం నాలుగో స్థానంలో ఉంది. ఈ ఏడాది జనవరి- అక్టోబర్‌ వరకు చూస్తే ప్రయాణికుల డిమాండ్‌ 20.11 శాతం పెరిగింది.

అదిక వేతనాలు బెంగళూరులోనే!

Friday 23rd November 2018

హైదరాబాద్‌: దేశంలో అన్ని నగరాల్లో కంటే బెంగళూరులోనే వేతనాలు ఎక్కువ అని లింక్డ్‌ఇన్‌ తాజా శాలరీ సర్వే వెల్లడించింది. అందరూ అనుకున్నట్లు అధిక వేతనాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు దక్కడం లేదని పేర్కొంది. అధిక వేతనాలను హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ ఉద్యోగులు ఎగరేసుకు పోతున్నారని వెల్లడించింది. లింక్డ్‌ఇన్‌కు భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. అమెరికా తర్వాత లింక్డ్‌ఇన్‌కు అధిక యూజర్లు ఉన్నది మన దేశంలోనే. తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న డేటా ఆధారంగా

Most from this category