STOCKS

News


ఉక్కు డిమాండ్‌లో వృద్ధి..!

Wednesday 17th October 2018
news_main1539749894.png-21219

న్యూఢిల్లీ: భారత ఉక్కు డిమాండ్‌ ఈఏడాదిలో 1,657.9 మిలియన్‌ టన్నులు (ఎంటీ)గా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఉక్కు స‌మాఖ్య (వరల్డ్ స్టీల్) అంచనావేసింది. గతేడాది డిమాండ్‌తో పోల్చితే ఇది 3.9 శాతం అధికంగా ఉన్నట్లు తెలిపింది. డీమానిటైజేషన్‌, వస్తు సేవల పన్ను అమలు వంటి అంశాల నుంచి పరిశ్రమ కోలుకుంటున్న నేపథ్యంలో ఈమేరకు అంచనాను విడుదలచేసినట్లు పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్నందున అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉక్కు డిమాండ్‌ ఊపందుకుంటుందని వివరించిన వరల్డ్ స్టీల్.. భారత డిమాండ్‌కు ఈ అంశం మరో ‍ప్రధాన కారణంగా నిలుస్తోందని వివరించింది. మౌలిక సదుపాయాల కార్యక్రమాలు మెరుగుపడడం, పెరుగుతున్న పెట్టుబడుల అంశాలతో పాటు రుణ ఒత్తిడిలో ఉన్న కంపెనీలను కూడా పరిగణలోనికి తీసుకునే అంచనాను వెల్లడించినట్లు తెలిపింది. తొలి అర్థభాగంలో చైనా ఉక్కు డిమాండ్‌ పెరిగినప్పటికీ.. ఆ తరువాత కాలంలో ఒడిదుడుకులు చోటుచేసుకున్నట్లు వివరించింది. 



You may be interested

సందీప్‌ భక్షి నియామకాన్ని ఆమోదించిన ఆర్‌బీఐ

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకుల సీఈఓ ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ).. ఎట్టకేలకు ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ పదవికి ప్రతిపాదిత సందీప్‌ భక్షి నియామకాన్ని ఆమోదించింది. అయితే, బ్యాంకు బోర్డ్‌ ప్రతిపాదించిన 5 ఏళ్ల పదవీకాలాన్ని పక్కన పెట్టి.. వచ్చే మూడేళ్లు ఈయన బ్యాంకు ఎండీ, సీఈఓగా కొనసాగే విధంగా నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 15 (సోమవారం) నుంచి

తొమ్మిదేళ్ల కనిష్టానికి పీనోట్స్‌ పెట్టుబడులు

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: మన క్యాపిటల్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్స్‌ (పీ నోట్స్‌)  పెట్టుబడులు తొమ్మిదిన్నరేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయి. సెప్టెంబర్‌ చివరికి రూ.79,548 కోట్లుగా ఉన్నాయి. పీ నోట్స్‌ను సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు జారీ చేస్తుంటారు. తమ పేర్లను నేరుగా నమోదు చేసుకోకుండా మన మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లు వీటిని తీసుకుంటుంటారు. సెబీ గణాంకాల ప్రకారం మన మార్కెట్లలో ఈక్విటీ, డెట్‌, డెరివేటివ్స్‌లో

Most from this category