News


ఎన్నికల అనంతరమే క్రెడిట్‌ రేటింగ్‌ రివ్యూ

Saturday 2nd February 2019
news_main1549100560.png-23968

భారత క్రెడిట్‌ రేటింగ్‌ ప్రొఫైల్‌పై ఫిచ్‌ 
ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ ఆధారంగానే భారత క్రెడిట్‌ సావరిన్‌ రేటింగ్‌ ప్రొఫైల్‌ను మదింపు చేస్తామని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఎన్నికల మందు వ్యయాలు పెరగడంతో విత్త స్లిపేజ్‌ కాస్త పెరిగిందని తెలిపింది. విత్తలోటు 0.1 శాతం పెరిగవచ్చని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ముందు అనుకున్న అంచనా 3.3 శాతం కాకుండా విత్తలోటు 3.4 శాతానికి చేరవచ్చని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి విత్తలోటు 3.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. తాజా బడ్జెట్‌ ఊహించినట్లే ఉందని, ఎన్నికలమందు ఇలాంటి బడ్జెట్‌ సాధారణమేనని ఫిచ్‌ ప్రతినిధి స్టీఫెన్‌ స్వార్ట్ట్జ్‌ చెప్పారు. క్రెడిట్‌ రేటింగ్‌ రివ్యూకు దీర్ఘకాలిక ఫిస్కల్‌ ట్రెండ్స్‌ను అధ్యయనం చేస్తామని, ఒకటి రెండు సంవత్సరాల విత్తట్రెండ్స్‌ క్రెడిట్‌రేటింగ్‌ను పెద్దగా ప్రభావితం చేయవని చెప్పారు. తాజా స్లిపేజ్‌ ఎన్నికల సందర్భంగా ఊహించినదేనన్నారు.

గతేడాది నవంబర్‌లో ఫిచ్‌ సంస్థ భారత్‌కు బీబీబీ మైనస్‌ రేటింగ్‌ను స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ఇచ్చింది. ఫిచ్‌ రేటింగ్‌లో కెల్లా ఇది తక్కువ గ్రేడ్‌. మరో రేటింగ్‌ ఏజన్సీ ఎస్‌అండ్‌పీ సైతం భారత్‌కు బీబీబీ మైనస్‌ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అధిక ప్రభుత్వ రుణం, అల్పఆదాయాల కారణంగా భారత రేటింగ్‌ను పెంచట్లేదని తెలిపింది. బలహీన విత్త పరిస్థితులు రేటింగ్‌ను మరింత కుంగదీస్తాయని ఈ రెండు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరో ప్రముఖ రేటింగ్‌ఏజన్సీ మూడీస్‌ మాత్రం భారత్‌ రేటింగ్‌ను 2017లో బీఏఏ 3 నుంచి బీఏఏ 2కు అప్‌గ్రేడ్‌ చేసింది. అవుట్‌లుక్‌ను పాజిటివ్‌ నుంచి స్టేబుల్‌కు మార్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం విత్తలోటు 3.4 శాతం లక్ష్యాన్ని చేరుకోలేకపోతే రేటింగ్‌ రివ్యూపై ప్రభావం పడవచ్చని హెచ్చరించింది. 



You may be interested

85 శాతం పన్ను చెల్లింపుదారులకు లాభం

Saturday 2nd February 2019

తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో 85 శాతం మంది పన్నుచెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ చెప్పారు. 2019-20 తాత్కాలిక బడ్జె‌ట్‌లో ప్రతిపాదించిన విధానాలు, రాయితీలతో మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, పేదవర్గాలు లబ్ధి పొందుతారని ఓ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ‘ఇది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్‌ కాదు. నాలుగున్నరేళ్లుగా మేం

స్టాక్స్‌పై ఒకే స్టాంప్‌ డ్యూటీ

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: స్టాక్స్‌, బాండ్స్ వంటి ఆర్థిక సాధనాల లావాదేవీలపై ఇకపై ఒకే స్టాంప్ డ్యూటీ రేటును వర్తింపచేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ డ్యూటీని స్టాక్ ఎక్స్చేంజీలే వసూలు చేసి, ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది. ఆయా లావాదేవీలు జరిపిన ఇన్వెస్టర్లు నివసించే రాష్ట్రాలతో కేంద్రం ఈ నిధులను పంచుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన స్టాంప్ డ్యూటీ ఉంటోంది. ఈ నేపథ్యంలో

Most from this category