STOCKS

News


ఆసియా-పసిఫిక్‌ జీడీపీలో పెరిగిన భారత్‌ వాటా!

Tuesday 11th September 2018
news_main1536641912.png-20150

న్యూఢిల్లీ: ఆసియా-పరిఫిక్‌ ప్రాంత స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో భారత్‌ వాటా గత 17 సంవత్సరాల్లో రెండున్నర శాతానికి పైగా పెరిగింది. 2000లో 14.6 శాతంగా ఉన్న ఈ వాటా 2017లో 17.3 శాతానికి పెరిగిందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది.  ‘ఆసియా-పసిఫిక్‌ 2018 ఆర్థిక పరిస్థితుల్లో కీలకాంశాలు’ పేరుతో విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

- మొత్తం ప్రపంచ ఉత్పత్తి (జీడీపీ)లో ఆసియా పసిఫిక్‌ ప్రాంత వాటా 2000లో 30.1 శాతం ఉంటే, 2017లో 42.6 శాతానికి పెరిగింది. 
- ఆసియా-పసిఫిక్‌ జనాభా సైతం సమీక్షా కాలంలో తగ్గింది. ప్రపంచ మొత్తం జనాభాలో ఈ ప్రాంతం జనాభా 2006లో 56 శాతం ఉంటే ఇప్పుడు 54.8 శాతానికి తగ్గింది.
-  ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో జీవనకాలం పెరుగుతోంది. శిశు మరణాల రేటు తగ్గుతుండడం, ఆరోగ్య సంరక్షణా చర్యలు మెరుగుపడుతుండడం దీనికి ప్రధాన కారణాలు. 2050 నాటికి వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. 2050 నాటికి 15 సంవత్సరాలలోపు ఉన్న వారి సంఖ్యకన్నా, 65 సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య పెరుగుతుంది. 
 



You may be interested

సెజ్‌ల అభివృద్ధికి సమయం పెంచాలి: డెవలపర్లు

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌లు) అభివృద్ధికి మరింత సమయం కావాలని మొత్తం 13 ఎస్‌ఈజెడ్‌ డెవలపర్లు వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరారు. జీ పీ రియల్టర్స్, జేబీఎఫ్ పెట్రోకెమికల్స్, అరబిందో ఫార్మాలు ఈ జాబితాలో ఉండగా.. ఈనెల 12న (బుధవారం) వాణిజ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగే స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ సమావేశంలో బోర్డ్‌ ఆఫ్‌ అప్రూవల్స్‌ తుది నిర్ణయం వెలువడనుంది. ఇప్పటివరకు తొమ్మిది సార్లు గడువుతేదీ పెంపు అనుమతి పొందిన

చౌక్సీ కోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు.. ఇంటర్‌పోల్‌కు ఈడీ ‘రిమైండర్’

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: ఆభరణాల వర్తకుడు మెహుల్‌ చోక్సీకోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా ఇందుకు సంబంధించి మరో ‘రిమైండర్‌ నోటీసు’ పంపింది.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు 2 బిలియన్‌ డాలర్ల మేర మోసం చేసి, చోక్సీ దేశం నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. చోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేయాలని జూన్‌లో (ముంబై కోర్టులో చోక్సీపై ఈడీ

Most from this category