STOCKS

News


సేవల రంగం జోరు..

Thursday 6th December 2018
news_main1544074496.png-22680

న్యూఢిల్లీ: కొత్త వర్క్ ఆర్డర్లు, సానుకూల మార్కెట్ పరిస్థితుల ఊతంతో నవంబర్‌లో సేవల రంగం వృద్ధి వేగం పుంజుకుంది. నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ నవంబర్‌లో 53.7 పాయింట్లుగా నమోదైంది. దీంతో వరుసగా ఆరో నెల కూడా వృద్ధి నమోదైనట్లయింది. అక్టోబర్‌లో ఇది 52.2 పాయింట్లుగా ఉంది. పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) ప్రమాణాల ప్రకారం సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే పెరుగుదలను, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. మరోవైపు తయారీ, సేవల రంగాలు రెండింటి పనితీరును ప్రతిఫలించే నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ సూచీ.. నవంబర్‌లో అత్యంత వేగవంతమైన వృద్ధి కనపర్చింది. అక్టోబర్‌లో 53గా ఉన్న సూచీ నవంబర్‌లో 54.5గా నమోదైంది. 2016 అక్టోబర్ తర్వాత ఇంత అధికంగా వృద్ధి చెందడం ఇదే ప్రథమం. సానుకూల మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో పదహారు నెలలుగా ఉద్యోగాల కల్పన కొనసాగుతోందని నివేదిక రూపొందించిన ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ సంస్థ  ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ పోల్యానా డె లిమా తెలిపారు. 

వృద్ధికి ఊతం: గర్గ్‌
వ్యాపార కార్యకలాపాలు, డిమాండ్‌ పెరుగుదలను నవంబర్ పీఎంఐ డేటా ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్‌ చెప్పారు. అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక వృద్ధి గణాంకాల సాధనకు ఇది తోడ్పడగలదని ఆయన తెలిపారు. గత నాలుగేళ్ల కాలం చూస్తే.. నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి రేటు మరింత మెరుగ్గా ఉందని మైక్రో బ్లాగింగ్ సైటు ట్విటర్‌లో గర్గ్ ట్వీట్ చేశారు. గత నెల విడుదల చేసిన డేటా ప్రకారం అక్టోబర్‌లో ఎగుమతులు సుమారు 18 శాతం పెరిగి దాదాపు 27 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబర్ మధ్య కాలంలో ఎగుమతులు 13 శాతం వృద్ధితో 191 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 



You may be interested

హువావే సీఎఫ్‌ఓ అరెస్ట్‌తో మార్కెట్లకు షాక్‌

Thursday 6th December 2018

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) మెంగ్ వాంగ్‌జోను కెనడా అధికారులు వాంకోవర్‌లో అరెస్టు చేశారు. ఇరాన్‌పై అమెరికా విధించిన వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈమెను వాంకోవర్‌లో అరెస్ట్‌ చేసినట్లు కెనడియన్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్ వెల్లడించారు. 2016 నుంచి యూఎస్‌ చట్టాలను ఉల్లంగిస్తూ పలు షిప్పింగ్స్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫేయ్‌ కుమార్తె

71 సమీపంలో రూపీ..

Thursday 6th December 2018

ఇండియన్‌ రూపాయి గురువారం నష్టాల్లో ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 71 సమీపంలో కదలాడుతోంది. రూపాయి తన మునపటి ముగింపుతో (70.46)పోలిస్తే 50 పైసలు క్షీణతతో 70.96 వద్ద ఉంది. బుధవారం నాటి ఆర్‌బీఐ పాలసీ రేట్లు నిర్ణయం వెలువడక ముందు రూపాయి 70.30-70.80 రేంజ్‌లో కదలాడింది. ఆర్‌బీఐ తన పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎస్‌ఎల్‌ఆర్‌ను 25 బేసిస్‌ పాయిం‍ట్ల మేర తగ్గించింది.

Most from this category