STOCKS

News


నేడే సెప్టెంబర్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాలు

Friday 30th November 2018
news_main1543555133.png-22513

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రెండవ త్రైమాసిక (జూలై-సెప్టెంబర్‌) అధికారిక గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. మొదటి త్రైమాసికంతో (8.2 శాతం) పోల్చితే ఈ వృద్ధి రేట్లు తగ్గుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ కాలంలో రూపాయి బలహీనత, క్రూడ్‌ ధరల తీవ్రత వంటి అంశాలు వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయన్నది విశ్లేషణ. సెప్టెంబర్‌ త్రైమాసిక అంచనాలను ఎస్‌బీఐ రిసెర్చ్‌ 7.5-7.6 శాతం శ్రేణిలో పేర్కొంది.  దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా  7.2 శాతం.కాగా ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.4 శాతం శ్రేణిలో ఉంటుందని గురువారం ఒక విడుదల చేసిన ఒక నివేదికలో ఆర్థిక విశ్లేషణా సంస్థ- ఎన్‌సీఏఈఆర్‌ పేర్కొంది. 



You may be interested

పేటీఎమ్‌ నష్టాలు.. బుల్లెట్‌ ట్రైన్‌ బడ్జెట్‌ అంత !

Friday 30th November 2018

ముంబై: భారత్‌లో ఈ కామర్స్‌ సంస్థలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఈ నష్టాలు మరింతగా పెరగగలవని కోటక్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక వెల్లడించింది. మొబైల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌ రెండేళ్ల క్రితం ఆరంభించిన పేటీఎమ్‌ మాల్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,806 కోట్ల మేర నష్టాలు వచ్చాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నష్టాలు.... ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైయిన్‌ ప్రాజెక్ట్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది

ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌4 శాతం వాటా విక్రయానికి ఎస్‌బీఐ ఓకే

Friday 30th November 2018

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4 శాతం వాటా విక్రయానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది. రెండు ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌కు 4 శాతం వాటాకు సమానమైన 86.2 లక్షల షేర్లను విక్రయించడానికి ఎస్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.482 కోట్లు. ఈ డీల్‌లో భాగంగా యాక్సిస్‌ న్యూ ఆపర్చునిటీస్‌ ఏఐఎఫ్‌-వన్‌  1.65 శాతం వాటా షేర్లను, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు చెందిన

Most from this category