STOCKS

News


వ్యక్తిగత సంపద 5 లక్షల కోట్ల డాలర్లకు

Tuesday 9th October 2018
news_main1539059316.png-20955

ముంబై: భారత్‌లో వ్యక్తుల సంపద ఏటా 13 శాతం చొప్పున పెరుగుతుందని, 2022 నాటికి 5లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) అంచనా వేసింది. 2017లో భారతీయుల వ్యక్తిగత సంపద 3  లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. వ్యక్తుల మొత్తం వ్యక్తిగత సంపద విలువ ఆధారంగా చూస్తే... 2022 నాటికి ప్రపంచంలో 11వ సంపన్న దేశంగా భారత్‌ అవతరిస్తుందని తన నివేదికలో తెలిపింది. ఈ విషయంలో 80 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా 2017 నాటికి అగ్ర స్థానంలో ఉండగా, 2022 నాటికి ఇది 100 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని బీసీజీ పేర్కొంది. చైనా 21 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానంలో ఉందని తెలిపింది. 2017 నాటికి భారత్‌లో 3,22,000 మంది అధిక ధనవంతులు ఉంటే, ఇందులో అధిక సంపద కలిగిన వారి సంఖ్య 87,000. 4,000 మంది అధిక సంపన్నులు కూడా ఉన్నారని బీసీజీ నివేదిక పేర్కొంది.



You may be interested

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా చేతికి జీఏఎల్‌ పగ్గాలు

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా సొంతం చేసుకుంది. జీఏఎల్‌లో పెట్టుబడులకు సంబంధించి ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లతో వివాదాన్ని ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిష్కరించుకున్నట్లు జీఎంఆర్‌ ప్రకటించింది. ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా పీఈ ఇన్వెస్టర్లకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో (జీఏఎల్‌) 5.86 శాతం ఈక్విటీ, 3,560 కోట్ల రూపాయల నగదును చెల్లించనున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ మెక్వయిరీ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌, జేఎం ఫైనాన్షియల్‌ ఓల్డ్‌లేన్‌ తదితర పీఈ ఇన్వెస్టర్లు

రేట్ల తగ్గింపు ప్రతికూలమే

Tuesday 9th October 2018

హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 2.50 మేర తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చమురు మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీ) మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం తెలిపింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగంలోని మూడు సంస్థల (ఐవోసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌) మొత్తం ఎబిటా మార్జిన్లు రూ.6,500 కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని వివరించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో వాటి

Most from this category