STOCKS

News


విదేశీ మారక నిల్వల్లో పెరుగుదల

Saturday 8th December 2018
news_main1544241159.png-22756

ముంబై: విదేశీ మారక నిల్వలు నవంబర్‌ 30తో ముగిసిన వారంలో 933 మిలియన్‌ డాలర్ల మేర పెరిగి మొత్తం 393.71 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో నిల్వలు 795 మిలియన్‌ డాలర్ల మేర తగ్గి 392.78 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. విదేశీ మారక నిల్వల్లో అమెరికాయేతర కరెన్సీలు యూరో, పౌండ్‌, యెన్‌ నిల్వలు కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి. బంగారం నిల్వల విలువ 151.8 మిలియన్‌ డాలర్ల మేర 21.15 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 



You may be interested

ఒపెక్ చమురు ఉత్పత్తిలో కోత

Saturday 8th December 2018

వియన్నా: చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌తో పాటు రష్యా తదితర భాగస్వామ్య దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తిని రోజుకు 12 లక్షల బ్యారెళ్ల మేర తగ్గించాలని నిర్ణయించాయి. క్రూడాయిల్‌ రేట్ల పెరిగేందుకు, తద్వారా చమురు ఉత్పత్తి దేశాలకు మరింత అధికాదాయం సమకూరేందుకు ఇది ఉపయోగపడనుంది. శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఒపెక్‌లోని 14 దేశాలు రోజుకు 8 లక్షల బ్యారెళ్లు, రష్యా సహా మిగతా భాగస్వామ్య దేశాలు

పెట్రోల్‌లో రెట్టింపు స్థాయికి ఇథనాల్

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత సీజన్‌లో పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 8 శాతానికి చేరే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు మిల్లులకు తక్కువ వడ్డీపై ‍మరింతగా రుణాలు లభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చక్కెర ఉత్పత్తి సంస్థల సమాఖ్య ఐఎస్‌ఎంఏ 84వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి

Most from this category