STOCKS

News


తగ్గిన భారత్‌ విదేశీ రుణ భారం

Saturday 29th September 2018
news_main1538201670.png-20700

ముంబై: భారత్‌ విదేశీ రుణ భారం జూన్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో 2.8 శాతం తగ్గింది. అప్పటికి ఈ రుణ మొత్తం 514.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2018 మార్చితో ముగిసిన త్రైమాసికంతో చూస్తే, ఇది 14.9 బిలియన్‌ డాలర్లు తక్కువ. వాణిజ్య రుణాలు (ఈసీబీ), స్వల్ప కాలిక డెట్‌, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు తగ్గడం దీనికి కారణం. ఇక ఇదే కాలంలో జీడీపీలో విదేశీ రుణ భారం నిష్పత్తి  20.5 శాతం నుంచి స్వల్పంగా 20.4 శాతానికి తగ్గింది. విదేశీ రుణాల్లో 37.8 శాతంతో ఈసీబీలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల వాటా 24.2 శాతంకాగా, స్వల్పకాలిక టర్మ్‌ ట్రేడ్‌ క్రెడిట్‌ 18.8 శాతం. భారత్‌ విదేశీ రుణంలో 50.1 శాతంతో అమెరికా డాలర్‌ డినామినేటెడ్‌ డెట్‌ మొదటి స్థానంలో ఉంది. తరువాతి వరుసలో ఇండియన్‌ రూపీ (35.4 శాతం), ఎస్‌డీఆర్‌ (5.4 శాతం), జపానీస్‌యన్‌ (4.7 శాతం), యూరో (3.3 శాతం) ఉన్నాయి. 



You may be interested

దేశీయ సహజవాయువు ధర 10 శాతం పెంపు

Saturday 29th September 2018

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరను 10 శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌, ఎరువుల తయారీ వ్యయాలు పెరిగి అంతిమంగా ధరల పెరుగుదలకు దారితీయనుంది. మిలియన్‌ బ్రిటిష్‌ ధర్మల్‌ యూనిట్‌ గ్యాస్‌ ధరను అక్టోబర్‌ 1 నుంచి 3.36 డాలర్లకు పెంచింది. ఇది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇది 3.06 డాలర్లుగా ఉంది. అమెరికా, రష్యా,

మార్కెట్‌ రుణ లక్ష్యం తగ్గింపు

Saturday 29th September 2018

న్యూఢిల్లీ: మార్కెట్‌ ద్వారా రుణ సమీకరణ స్థూల అంచనాల లక్ష్యాన్ని కేంద్రం రూ.70,000 కోట్లు తగ్గించుకుంది. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. 2018-19 ఆర్థిక సం‍వత్సరంలో మార్కెట్‌ రుణాల ద్వారా రూ.6.05 లక్షల కోట్లు సమీకరించుకోవాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం- ఇందులో రూ.70,000 కోట్లు తగ్గించుకుంది. ‘‘మంచి ప్రజాదరణ ఉన్న చిన్న పొదుపు మొత్తాల పథకాల ద్వారా అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో అంచనాలకు మించి

Most from this category