STOCKS

News


ఎగుమతులు 18 శాతం అప్‌

Friday 13th July 2018
news_main1531502867.png-18295

న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జూన్‌లో 17.57 శాతం పెరిగి 27.7 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, అదే సమయంలో అధిక ముడి చమురు రేట్ల కారణంగా దిగుమతుల భారం పెరిగి.. వాణిజ్య లోటు మూడున్నరేళ్ల గరిష్ట స్థాయి 16.6 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఈ స్థాయికి ఎగియడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇది 16.86 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక గతేడాది జూన్‌లో ఇది 12.96 బిలియన్ డాలర్లు. కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌లో దిగుమతులు 21.31 శాతం పెరిగాయి. 44.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో చూసుకుంటే ఎగుమతులు 14.21 శాతం, దిగుమతులు 13.49 శాతం పెరిగాయి. ఎగుమతుల విలువ 82.47 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 127.41 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం మీద వాణిజ్య లోటు 44.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జూన్‌లో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు, వజ్రాభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. చమురు దిగుమతులు 56.61 శాతం ఎగిసి 12.73 బిలియన్ డాలర్లుగా ఉండగా, పసిడి దిగుమతులు మాత్రం 3 శాతం క్షీణించి 2.38 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. టెక్స్‌టైల్స్‌, లెదర్‌, మెరైన్ ఉత్పత్తులు, పౌల్ట్రీ, జీడిపప్పు, బియ్యం, కాఫీ తదితర ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి మందగించింది. 



You may be interested

జాన్సన్‌ అండ్ జాన్సన్‌కు 4.7 బిలియన్ డాలర్ల జరిమానా

Friday 13th July 2018

సెయింట్ లూయీ (అమెరికా): బేబీ టాల్కం పౌడర్లో ఆస్‌బెస్టాస్‌ అవశేషాల వివాదంలో దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కి (జేఅండ్‌జే) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్ వాడటం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడిన 22 మంది బాధిత మహిళలు, వారి కుటుంబాలకు 4.7 బిలియన్ డాలర్ల మేర పరిహారం చెల్లించాలంటూ సెయింట్ లూయీ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా జేఅండ్‌జే తయారు చేసే బేబీ పౌడర్‌, షవర్‌

ఇన్పోసిస్‌ 1:1 బోనస్‌

Friday 13th July 2018

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా 1:1 బోనస్‌ను ప్రకటించింది.  ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.3,612 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం (రూ.3,483 కోట్లు)తో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని ఇన్ఫోసిస్‌ తెలిపింది. అయితే అంతకు ముందటి క్వార్టర్‌(గత

Most from this category