STOCKS

News


అక్టోబర్‌ నుంచీ భారత్‌ ‘ఆర్థికం’ మందగమనం!

Tuesday 11th September 2018
news_main1536642261.png-20153

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్థభాగం (అక్టోబర్‌-మార్చి)లో మందగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- యూబీఎస్‌ అంచనావేస్తోంది. తాజా నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే...

  •  ద్రవ్య పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. భారీ స్థాయిలో క్రూడ్‌ ధరలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం దీనికి కారణం. 
  •  ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే అక్టోబర్‌-మార్చి మధ్య కాలంలో 7 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుంది. 
  •  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పట్లో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం) పెరిగే అవకాశం లేదు. 

మార్చి నాటికి రూపాయి @ 73: యూబీఎస్‌
భారత కరెన్సీ రూపాయి 2019 మార్చి నాటికి డాలర్‌తో పోలిస్తే రూ.73 స్థాయికి క్షీణిస్తుందని స్విస్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ అంచనా వేసింది. చెల్లింపుల బ్యాలన్స్‌ (బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌) ప్రతికూలంగా ఉన్న అతిపెద్ద వర్ధమాన దేశం భారతేనని, ఈ ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. జీఎస్టీ వసూళ్లతోపాటు, పెట్టుబడుల ఉపసంహరణలో తగ్గుదల ఉండడం వల్ల మొత్తం మీద ద్రవ్యలోటు 2018-19లో 6.5 శాతంగా ఉంటుందని యూబీఎస్‌ అంచనా వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు 5.9 శాతంగా ఉంటుందని బడ్జెట్‌లో పేర్కొన్న విషయం గమనార్హం. బడ్జెట్‌ అంచనాలను చేరుకోవడం కష్టమేనని యూబీఎస్‌ అభిప్రాయపడింది. చెల్లింపుల (ఎక్స్‌టర్నల్‌) బ్యాలన్స్‌లు అన్నవి కరెన్సీని ప్రభావితం చేసే కీలక అంశాల్లో ఒకటని, ఇందులో బలహీనతే రూపాయి ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం నష్టపోవడానికి దారితీసినట్టు యూబీఎస్‌ తెలిపింది. ‘‘2019 ఆర్థిక సంవత్సరం క్యాడ్‌ అంచనాను 2.5 శాతం నుంచి 2.7 శాతానికి సవరిస్తున్నాం. దీనివల్ల భారత చెల్లింపుల బ్యాలన్స్‌ అన్నది జీడీపీలో ఒక శాతం లోటుగా ఉంటుంది. ఏడేళ్లలో ఇదే మొదటిసారి’’ అని యూబీఎస్‌ వివరించింది. ఈ ఒత్తిళ్లు 2020 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతాయని అంచనా వేసింది. అంతర్జాతీయ అనిశ్చితులే క్యాడ్‌, ద్రవ్యలోటు పెరిగేందుకు, ఫైనాన్షియల్‌ మార్కెట్ల ఆటుపోట్లకు కారణంగా పేర్కొంది. 



You may be interested

ఆస్ట్రేలియా ఓపెన్‌తో ఇన్ఫీ జట్టు

Tuesday 11th September 2018

బెంగళూరు: సాంకేతిక ఆవిష్కరణలో భాగంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. మూడేళ్లు కొనసాగే ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త తరహా సేవలందించడానికి అవకాశం లభించినట్లుగా భావిస్తున్నామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సలీల్ పరేఖ్ అన్నారు. ‘డిజిటల్‌ టెక్నాలజీ హద్దులను దాటుకుని ఎంత వరకు వెళ్లగలదనే అంశాన్ని టోర్నమెంట్‌లో ప్రదర్శించాలని అనుకుంటున్నాం. టోర్నీ చూసే విధానంలో మార్పులు తేవాలని

‘మోటో జీ6 ప్లస్‌’ వచ్చేసింది

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: వేగవంతమైన చార్జింగ్‌ సదుపాయం, అత్యాధునిక కెమెరా టెక్నాలజీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను మోటొరోలా మార్కెట్‌లో ఆవిష్కరించింది.  ‘మోటో జీ6 ప్లస్‌’ పేరిట సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌.. 6జీబీ ర్యామ్‌, 64 అంతర్గత మెమొరీ, 5.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు మోటొరోలా వెల్లడించింది. వెనుకవైపు 12, 5 మెగాపిక్సెల్ డ్యుయల్‌ కెమెరాలు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ లెన్స్‌ అనుసంధానించటం

Most from this category