STOCKS

News


మరింత మెరుగుపడనున్న ఆర్థిక వృద్ధి

Monday 13th August 2018
news_main1534136695.png-19205

న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్‌తో పాటు పెట్టుబడులూ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో భారత ఆర్థిక వృద్ధి మరింత మెరుగుపడగలదని పరిశ్రమలపై నిర్వహించిన సీఐఐ-ఆస్కాన్ సర్వేలో వెల్లడైంది. మెరుగైన వర్షపాతం, ఒక మోస్తరు ద్రవ్యోల్బణం, పండుగల సీజన్ మొదలైన సానుకూల అంశాలతో వినియోగం పెరుగుతుందని.. డిమాండ్‌, పెట్టుబడుల రికవరీకి ఇది తోడ్పడనుందని సర్వే నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 70 రంగాలపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ తెలిపారు. కేవలం కొన్ని రంగాల్లో మాత్రమే ప్రతికూల వృద్ధి ధోరణులు కనిపించాయని ఆయన వివరించారు. 2018-19 ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో 20 శాతం పైగా అధిక వృద్ధి సాధించిన రంగాల జాబితా గణనీయంగా పెరిగింది. అలాగే, 'అధిక', 'ఒక మోస్తరు' వృద్ధి కనపర్చిన రంగాలు కూడా కొంత మేర పెరిగాయి. దిగుమతుల నుంచి పోటీ (50 శాతం), నియంత్రణ సంస్థల నిబంధనలపరమైన భారం (42.9 శాతం), మౌలిక సదుపాయాల కొరత (41.7 శాతం) మొదలైనవి వృద్ధికి సవాలుగా ఉంటున్నాయని సర్వేలో పాల్గొన్న సంస్థలు పేర్కొన్నాయి. 63.6 శాతం సంస్థలు తమ రంగాల్లో వ్యాపార అవకాశాలు ఒక మోస్తరుగా మెరుగుపడతాయని ధీమాగా ఉండగా.. 31 శాతం సంస్థలు వచ్చే ఆరు నెలలు కూడా ప్రస్తుత పరిస్థితే కొనసాగవచ్చని భావిస్తున్నాయి. 



You may be interested

37,585 మద్దతు కీలకం

Monday 13th August 2018

ఇక్కడి నిఫ్టీ-50...అమెరికా బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ ఎస్‌ అండ్‌ పీ-500 ఇండెక్స్‌ను అనుసరిస్తున్నట్లు గత కొద్దివారాల ట్రెండ్‌ స్పష్టంచేస్తున్నదని, ఆ సూచీలో తీవ్రమైన కరెక‌్షన్‌ వస్తేనే..మన మార్కెట్‌ కూడా పతనమయ్యే ప్రమాదం వుంటుందని భావించాల్సివుంటుంటూ గత కాలమ్‌లో సూచించాం. క్రితం వారం ఎస్‌ అండ్‌ పీ-500 వరుసగా మూడురోజులపాటు కొత్త గరిష్టస్థాయిని తాకడానికి చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో శుక్రవారం 20 పాయింట్లు నష్టపోయింది. అంటే...అమెరికా ప్రధాన సూచీలో డబుల్‌టాప్‌ సంకేతాలు కన్పిస్తున్నట్లు

రాఫెల్‌ కాంట్రాక్టు రక్షణ శాఖ ఇవ్వలేదు

Monday 13th August 2018

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల సరఫరా కాంట్రాక్టు విషయంలో అనిల్‌ అంబానీ గ్రూపు పాత్రపై రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో... దీనిపై అనిల్‌ అంబానీ గ్రూపు వివరణ ఇచ్చింది. రక్షణ శాఖ నుంచి ఎటువంటి కాంట్రాక్టు తమకు రాలేదని, ఇది తప్పు అని, ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలుగా పేర్కొంది. 36 యుద్ధ విమానాలను సరఫరా చేయాల్సిన ఫ్రెంచ్‌ సంస్థ దసాల్ట్‌ గ్రూపు, ఒప్పందం మేరకు విమానాల సరఫరాకు రిలయన్స్‌

Most from this category