STOCKS

News


ఆగస్టులో ‘మౌలికం’ వృద్ధి నెమ్మది!

Tuesday 2nd October 2018
news_main1538451406.png-20778

న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన మౌలిక విభాగం ఆగస్టు నెలలో మందగించింది. ఈ రంగాల వృద్ధి రేటు కేవలం 4.2 శాతంగా నమోదయ్యింది. క్రూడ్‌ ఆయిల్‌, ఎరువులు పేలవ పనితీరు దీనికి కారణం.  2018 జూలైలో ఈ రేటు 7.3 శాతం. 2017 ఆగస్టులో 4.4 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో  ఎనిమిది రంగాల వాటా 40.27 శాతం.  వీటిలో బొగ్గు , క్రూడ్‌ ఆయిల్‌ , నేచురల్‌ గ్యాస్‌ , రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు , స్టీల్‌, సిమెంట్‌, విద్యుత్‌  రంగాలు ఉన్నాయి. 
ఏప్రిల్‌-ఆగస్టు మధ్య అప్‌...
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ చూస్తే, (2017 ఇదే కాలంతో పోల్చి) గ్రూప్‌ వృద్ధి రేటు 3 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. 
సెప్టెంబర్‌లో ‘తయారీ’ బాగుంది: పీఎంఐ
ఇదిలావుండగా, సెప్టెంబర్‌ నెలలో తయారీ రంగం పనితీరు బాగుందని నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ పేర్కొంది. కొత్త ఆర్డర్లు పెరగడం దీనికి కారణం. ఆగస్టులో ఈ సూచీ 51.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో 52.2 శాతానికి పెరిగింది. పీఐఎం సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువన క్షీణతగా భావించడం జరుగుతుంది. 50పైన సూచీ కొనసాగుతుండడం వరుసగా ఇది 14వ నెల. 


 



You may be interested

ఆధార్‌తో ‘గుర్తింపు’ను ఆపేయండి

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: వినియోగదారుల గుర్తింపునకు  ఆధార్‌ను ఉపయోగించే  ప్లాన్‌ను 15 రోజుల్లోగా ఆపేయాలని    టెలికం కంపెనీలను యూఐడీఏఐ ఆదేశించింది. ఈ మేరకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఆధార్‌ వినియోగంపై సుప్రీం కోర్ట్‌ ఇటీవలనే స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఆధార్‌ విషయమై సుప్రీం కోర్ట్‌ ఇటీవల వెలువరించిన తీర్పుకు అనుగుణంగా టెలికం కంపెనీలు చర్యలు తీసుకోవాలని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్‌తో వినియోగదారుల గుర్తింపు

రద్దు చేస్తే... హక్కులు వదులుకున్నట్టు కాదు

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) మాఫీ చేస్తుండడాన్ని (రైటాఫ్‌) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమర్థించుకున్నారు. ఇలా చేయడం ఎన్‌పీఏలపై హక్కులు వదులుకోవడానికి దారితీయదన్నారు. బ్యాంకులు తమ బ్యాలన్స్‌ షీట్లను ప్రక్షాళించుకోవడానికి, పన్ను ప్రయోజనం పొందడానికి వీలు పడుతుందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.36,551 కోట్ల ఎన్‌పీఏలను వసూలు చేసినట్టు చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో

Most from this category