STOCKS

News


రుణ కట్టడికి పటిష్ట చర్యలు అవసరం

Thursday 7th February 2019
news_main1549524067.png-24069

-అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సూచన
వాషింగ్టన్‌: రుణాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని భారత్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సూచించింది. ద్రవ్యలోటు నియంత్రణ విషయంలో గత ప్రణాళికలకు భిన్నంగా ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాలను ప్రకటించిన నేపథ్యంలో ఐఎంఎఫ్‌ తాజా సూచన చేసింది. ‘‘2024-25 నాటికి జీడీపీలో రుణ నిష్పత్తిని 40 శాతానికి (ప్రస్తుతం దాదాపు 70 శాతం) తగ్గించాలన్న ప్రణాళికను 2018-19 బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం ఉద్ఘాటించింది. అయితే ఈ మధ్య కాలిక  రుణ లక్ష్యం దిశగా పురోగతిలో మందగమనం కనబడుతోంది’’ అని ఐఎంఎఫ్‌ మిషన్‌ (ఇండియా) చీఫ్‌ రానిల్‌ సల్‌గాడో పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు పన్ను బేస్‌ మరింత పెరగాల్సి ఉందని పేర్కొన్నారు.
ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యలోటు!
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును పూడ్చుకునే మార్గాల్లో ప్రభుత్వానికి రుణ సమీకరణ ఒకటి. ద్రవ్యలోటు కట్టుతప్పుతుండడం ఆర్థికవర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. 2018-19  ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్‌ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. అయితే 2018 నవంబర్‌ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. మెజారిటీ ఆర్థిక సంస్థలు, విశ్లేషణలకు అనుగుణంగానే 2018-19 ద్రవ్యలోటు అంచనాలను 3.4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన తాజా బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం. కాగా ద్రవ్యలోటును 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3 శాతానికి కట్టడి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.



You may be interested

అక్టోబర్‌ - డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు

Thursday 7th February 2019

బెర్జర్‌ పెయింట్స్‌ నికర లాభం రూ.140 కోట్లు కోల్‌కత్తా: బెర్జర్‌ పెయింట్స్‌ కన్సాలిడేటెడ్‌ లాభం డిసెంబర్‌ క్వార్టర్లో 2.7 శాతం వృద్ధితో రూ.133.9 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.1,616.7 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.130.4 కోట్లు, ఆదాయం రూ.1338.6 కోట్లుగా ఉంది. స్టాండలోన్ నికర లాభం 7.4 శాతం వృద్ధిచెంది రూ.119.5 కోట్లకు చేరుకుంది. ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.1,460 కోట్లకు

రాయల్టీపై జుబిలంట్‌ ప్రమోటర్లు వెనక్కి

Thursday 7th February 2019

సాయంత్రం నిర్ణయం... రాత్రి ఉపసంహరణ వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావటం వల్లే న్యూఢిల్లీ: డామినోస్‌ పిజ్జా ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ ప్రమోటర్లు... తమ సంస్థకు వచ్చే మొత్తం ఆదాయంలో 0.25 శాతాన్ని రాయల్టీగా తమకు చెల్లించాలన్న ప్రతిపాదనపై వెనక్కి తగ్గారు. డామినోస్‌ బ్రాండ్‌పై పిజ్జా ఔట్‌లెట్లు నిర్వహిస్తోంది కనక​ఈ సంస్థ తమ మొత్తం ఆదాయంలో కొంత శాతాన్ని ఇప్పటికే అంతర్జాతీయ సంస్థయిన డామినోస్‌ బ్రాండ్‌ యాజమాన్యానికి రాయల్టీ రూపంలో

Most from this category