STOCKS

News


ఐఎంఎఫ్ బాధ్యతలు స్వీకరించిన గీతా గోపీనాథ్‌

Wednesday 9th January 2019
news_main1547012790.png-23477

  • చీఫ్‌ ఎకనమిస్ట్‌గా నియమితులైన తొలి మహిళ

వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ (47) బాధ్యతలు చేపట్టారు. ఆమె ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ కావడం విశేషం. అమెరికా పౌరసత్వం ఉన్న గీతా గోపీనాథ్.. హార్వర్డ్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేసిన ఐఎ౾౾ంఎఫ్ రీసెర్చ్ విభాగం ఎకనమిక్ కౌన్సిలర్, డైరెక్టర్ మారిస్ ఆబ్స్‌ఫెల్డ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 1న గీతా గోపీనాథ్ నియామకాన్ని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ ప్రకటించారు. గీతా గోపీనాథ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆర్థికవేత్తల్లో ఒకరని లగార్డ్ కితాబిచ్చారు. బహుళజాతి సంస్థలు పెను సవాళ్లు ఎదుర్కొంటుండటం, ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్‌ను పక్కనపెట్టి దేశీయ అంశాలకే ప్రాధాన్యమిస్తుండటం వంటి ధోరణులు పెరుగుతున్న తరుణంలో ఐఎంఎఫ్ చీఫ్‌ ఎకనమిస్టుగా గీతా గోపీనాథ్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్ నుంచి వెనక్కి తగ్గుతుండటాన్ని నివారించడం ఐఎంఎఫ్ ముందున్న పలు ప్రధాన సవాళ్లలో ఒకటని ది హార్వర్డ్ గెజిట్‌కిచ్చిన ఇంటర్వ్యూలో గీత తెలిపారు. "గ్లోబలైజేషన్‌లో భాగంగా గడిచిన 50-60 ఏళ్లలో ప్రపంచ దేశాలు టారిఫ్‌లు తగ్గించుకోవడం, వాణిజ్యం పెంచుకోవడం వంటివి చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లోబలైజేషన్ నుంచి ప్రస్తుతం వెనక్కి తగ్గుతున్నాయి. చైనా తదితర దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం, ఆయా దేశాలు కూడా అదే రీతిలో స్పందించడం కొన్ని నెలలుగా చూస్తున్నాం. దీంతో వాణిజ్య విధానాలపై అనిశ్చితి పెరుగుతోంది. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం పెరగడం వల్ల అంతర్జాతీయంగా పేదరికం తగ్గినా.. దాని ప్రభావంతో అసమానతలు పెరిగిపోయాయన్న ఆందోళన ఉంది. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు తగు చర్యల అవసరం ఉంది" అని ఆమె పేర్కొన్నారు. అమెరికా వడ్డీ రేట్లను పెంచుతుండటం వల్ల వర్ధమాన దేశాలపై పడుతున్న ప్రభావాలు, వాణిజ్యంలో డాలర్ ఆధిపత్య ప్రభావాలు మొదలైన వాటిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.You may be interested

ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ కిమ్‌ రాజీనామా

Wednesday 9th January 2019

- ఇంకా మిగిలి ఉన్న పదవీకాలం మూడేళ్లు - ప్రైవేట్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలో చేరిక వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి జిమ్ యోంగ్ కిమ్ రాజీనామా చేశారు. పదవీకాలం ఇంకా మూడేళ్లుండగానే ఆయన అర్ధంతరంగా తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలో చేరే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి కిమ్ (58) రాజీనామా చేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కొత్త చీఫ్

పసిడి...ప్రపంచ మార్కెట్లో తగ్గుదల-దేశీయంగా పెరుగుదల

Wednesday 9th January 2019

గతవారం 1300 డాలర్లను తాకిన పసిడి ధర ఈ వారంలో వెనకడుగు వేస్తోంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు నష్టపోయి 1282 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఫలప్రదం కావచ్చనే అంచనాలతో ఈ వారంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల పట్టాయి. అమెరికా మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగియగా, ఆసియా

Most from this category