STOCKS

News


నల్లధనం సమాచార మార్పిడిపై స్విస్‌తో భారత్ చర్చలు

Saturday 11th August 2018
news_main1533957257.png-19159

న్యూఢిల్లీ: స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం వివరాలను సేకరించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా వారి రహస్య ఖాతాల్లోని డబ్బుకు సంబంధించి ఆటోమేటిక్‌గా సమాచార మార్పిడిపై స్విట్జర్లాండ్‌తో చర్చలు జరుపుతోంది. శుక్రవారం విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి ఇగ్నేజియో క్యాసిస్ మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్‌గా సమాచార మార్పిడికి తోడ్పడేటువంటి ఒప్పందానికి స్విట్జర్లాండ్ పార్లమెంటరీ కమిటీ గతేడాది ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఖాతాదారు అకౌంటు నంబరు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, వడ్డీ, డివిడెండ్‌, బీమా పాలసీల ద్వారా వచ్చే మొత్తం, ఖాతాల్లో బ్యాలెన్స్‌, అసెట్స్ అమ్మకాల ద్వారా వచ్చిన నిధులు మొదలైన వివరాలను ఇచ్చిపుచ్చుకునేందుకు వీలవుతుంది. 



You may be interested

పారిశ్రామిక రంగం పరుగు

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో పరుగు పెట్టింది. సంబంధిత సమీక్షా నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యింది. మే నెలలో ఈ రేటు 3.9 శాతంకాగా, 2017 జూన్‌లో వృద్ధి అసలు లేకపోగా, -0.3 శాతం క్షీణత నమోదయ్యింది. సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీతోపాటు మైనింగ్‌, విద్యుత్‌ రంగాల నుంచి మెరుగైన ఉత్పత్తి జూన్‌లో మంచి వృద్ధి ఫలితానికి దారితీసింది.

బాష్‌ లాభం 42 శాతం అప్‌

Saturday 11th August 2018

 న్యూఢిల్లీ: టెక్నాలజీ సర్వీసులందించడంతో పాటు వాహన విడిభాగాలు కూడా తయారు చేసే బాష్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 42 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.303 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.431 కోట్లకు పెరిగిందని బాష్‌ తెలిపింది. వాహన విడిభాగాల వ్యాపారం జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని బాష్‌ ఎమ్‌డీ సౌమిత్ర

Most from this category