News


రెండంకెల వృద్ధే లక్ష్యం!

Saturday 18th May 2019
news_main1558153918.png-25818

  • దేశం మధ్యాదాయ చట్రంలోకి వెళ్లకపోవచ్చు
  • ఈఏసీ- పీఎం సభ్యురాలు షమికా రవి

న్యూఢిల్లీ: రెండంకెల వృద్ధి రేటు సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అవసరమని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) సభ్యురాలు షమికా రవి చెప్పారు. 7 శాతం వృద్ధితో సరిపెట్టుకోకూడదని ఆమె స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదిగే క్రమంలో మధ్యలోనే ఆగిపోయే ‘మధ్యాదాయ చట్రం’లో భారత్‌ ఇరుక్కుపోతుందంటూ సహచర ఈఏసీ-పీఎం సభ్యుడు రతిన్‌రాయ్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. బ్రూకింగ్స్‌ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రెండంకెల వృద్ధి సాధనకు ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. రెండంకెల వృద్ధికి విధానాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. ఇటీవలే ఓ సందర్భంలో రతిన్‌ రాయ్‌ మాట్లాడుతూ... ‘‘1991 నుంచి మన ఆర్థిక వ్యవస్థ ఎగుమతులపై ఆధారపడి వృద్ధి చెందడం లేదు. దేశంలోని పది కోట్ల మంది వినియోగం ఆధారంగానే వృద్ధి చెందుతోంది. భారత వృద్ధి ప్రస్థానానికి శక్తినిస్తోంది వీరే. అంటే త్వరలోనే మనం ఓ దక్షిణ కొరియా కాదు, చైనా కూడా కాబోవడం లేదు. మనం ఓ బ్రెజిల్‌, ఓ దక్షిణాఫ్రికా కానున్నాం. అధిక సంఖ్యలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారితో మధ్యదాయ దేశంగా మారబోతున్నాం’’అని అన్నారు. దానిపై షమికా ఈ వ్యాఖ్యలు చేశారు. 



You may be interested

నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 18th May 2019

మిడ్‌సెషన్‌ నుంచి నెలకొన్న అమ్మకాలతో అమెరికా మార్కెట్ల మూడురోజుల వరుస ర్యాలీకి శుక్రవారం బ్రేకు పడింది. మార్కెట్‌ ప్రారంభానికి ముందు వెల్లడైన కన్జూ‍్యమర్‌ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్లో నెలకొన్న అమ్మకాలు ఆరంభలాభాల్ని హరించివేశాయి.  అమెరికా చైనాలు పరస్పరం టారీఫ్‌లను విధించుకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ చర్చల సఫలంపై సందిగ్ధత నెలకొంది. చైనా

యస్‌ బ్యాంక్ మాజీ బాస్ బోనస్ వెనక్కి

Saturday 18th May 2019

ఆర్‌బీఐ ఆదేశాలతో అసాధారణ నిర్ణయం రాణా కపూర్‌కి చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్ ఉపసంహరణ న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్ తాజాగా అసాధార౾౾ణ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మాజీ ఎండీ రాణా కపూర్‌కు చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్‌లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. బోనస్‌ కింద 2014-15లో రూ. 62.17 లక్షలు, 2015-16లో చెల్లించిన రూ. 82.45

Most from this category