STOCKS

News


భారీగా పెరుగుతున్న సంపద

Thursday 29th November 2018
news_main1543469030.png-22467

న్యూఢిల్లీ: భారత్‌లో అధిక విలువ కలిగిన వ్యక్తుల (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంపద అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2017లో 22 శాతం పెరిగింది. ఆసియా ప్రాంతంలో ఇది వేగవంతమైన వృద్ధి అని క్యాప్‌జెమిని సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఆసియా పసిఫిక్‌ వెల్త్‌ రిపోర్ట్‌ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఒక మిలియన్‌ డాలర్లు (రూ.7 కోట్లకు పైగా) అంతకంటే ఎక్కువ సంపద (స్టాక్స్‌, బాండ్ల, ఇతర రూపాల్లో) కలిగిన వారిని మిలియనీర్లుగా లేదా హెచ్‌ఎన్‌డబ్ల్యూఐగా చెబుతారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధిక సంపద కూడబెట్టిన వారిలో జపాన్‌ ధనవంతులు ముందు నిలిచారు. వీరి సంపద 7.7 లక్షల కోట్ల డాలర్ల మేర ఉన్నట్టు క్యాప్‌జెమిని సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసింది. చైనా ధనవంతులు తమ సంపదను వేగంగా పెంచుకుంటున్నారని... వీరి వద్దనున్న మొత్తం సంపద 2010-2017 మధ్య 144 శాతానికి పైగా పెరిగి 6.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇదే సమయంలో జపాన్‌ వాసుల సంపద వృద్ధి 87 శాతమేనని తెలిపింది. 
ఇండోనేషియాలో మూడింతలు
ఇండోనేషియాలో హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంపద ఏకంగా మూడున్నర రెట్లు పెరిగింది. 2016లో 184 బిలియన్‌ డాలర్లుగానే ఉంటే, 2017లో ఏకంగా 661 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2016-17లో పన్ను పరంగా క్షమాభిక్షకు అవకాశం కల్పించడంతో ఆ ప్రభావం మేరకు బేస్‌ను మార్పు చేయడమే భారీ పెరుగుదలకు కారణమని క్యాప్‌ జెమిని తెలిపింది. దక్షిణ కొరియాలోని హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంపద గతేడాది 18 శాతం పెరిగి ఆసియాలో భారత్‌ తర్వాత వృద్ధి పరంగా రెండో స్థానంలో నిలిచింది. హాంగ్‌కాంగ్‌లో వృద్ధి 16.3 శాతం మేర ఉంది. ఇది మూడో స్థానంలో ఉంది. సింగపూర్‌లో హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల ఆస్తుల విలువ 13 శాతం పెరిగి ఆసియా ప్రాంతంలో థాయిలాండ్‌, తైవాన్‌ తర్వాత ఆరో స్థానంలో నిలిచింది. సంపద వృద్ధి ఇకపైనా ఇదే వేగంతో కొనసాగుతుందని క్యాప్‌జెమిన్‌ అంచనా. 2010-2017 మధ్య ఆసియాలోని హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంపద రెండింతలై 21.6 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని, 2025 నాటికి ఇది రెండింతలై 42 బిలియన్‌ డాలర్లను చేరుతుందని అంచనా వేసింది. 2017లో ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల వద్దనున్న మొత్తం సంపదలో ఆసియా పసిఫిక్‌ ప్రాంత సంపన్నుల వాటా 41.4 శాతంగా ఉంది.  


 



You may be interested

ఐదేళ్లలో 6,500 చార్జింగ్‌ స్టేషన్లు

Thursday 29th November 2018

ముంబై: ఈవీ మోటార్స్‌ ఇండియా కంపెనీ ఐదేళ్లలో 6,500 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నది. ప్లగ్‌ఎన్‌గో పేరుతో ఈ చార్జింగ్‌ స్టేషన్లను డీఎల్‌ఎఫ్‌, ఏబీబీ ఇండియా, డెల్టా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల భాగస్వామ్యంతో  ఏర్పాటు చేయనున్నామని ఈవీ మోటార్స్‌ తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ స్టార్టప్‌ తెలిపింది.  వివిధ నగరాల్లో వ్యాపార, నివాసిత ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు

మార్కెట్లకు పావెల్ బూస్ట్‌

Thursday 29th November 2018

న్యూయార్క్: స్టాక్‌ మార్కెట్లకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ నూతన ఉత్సాహాన్ని ఇచ్చారు. వడ్డీ రేట్లకు సంబంధించి ఈయన కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లన్నీ లాభాలను నమోదుచేశాయి. ‘అమెరికా వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు తటస్థ స్థాయిలో ఉన్నాయనే అంచనాలు విస్తృత పరిధిలో ఉండగా..ఇంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవడానికి కానీ,

Most from this category