లింగ అసమానతలో భారత్ 108వ స్థానం
By Sakshi

న్యూఢిల్లీ: స్త్రీ, పురుషుల మధ్య అసమానతలకు సంబంధించి ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 108వ స్థానంలో నిల్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన ‘గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్' ప్రకారం గతేడాది కూడా భారత్ ఇదే ర్యాంక్ దక్కించుకుంది. ఆర్థికపరమైన అవకాశాలు, రాజకీయ సాధికారికత, విద్య, ఆరోగ్యం, మనుగడలను ప్రధాన అంశాలుగా తీసుకుని ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. దేశీయంగా సీనియర్, ప్రొఫెషనల్ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సి ఉందని ఈ సంస్థ సూచించింది.
You may be interested
సీఐఈ ఇంక్యుబేటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Wednesday 19th December 2018హైదరాబాద్: ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ (సీఐఈ) ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ రెసిడెన్సీ (ఈఐఆర్) ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఏడాది పాటు నెలకు రూ.30 వేలు ఉపకారవేతనంతో పాటూ మెంటార్స్, ఇన్వెస్టర్లను కలిసే అవకాశం ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 10. 2009లో ప్రారంభమైన సీఐఈలో ఇప్పటివరకు 160 స్టార్టప్స్ ప్రోత్సాహం అందించింది.
ఆర్బీఐ నుంచి మరో రూ.10,000 కోట్లు
Wednesday 19th December 2018ముంబై: ఆర్థిక వ్యవస్థలోకి మరో 10,000 కోట్ల నిధులను అందించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ నెలలో ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ల ద్వారా రూ.40,000 కోట్లు అందించనున్నామని గతంలో ఆర్బీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంట్లో ఇప్పటికే సగం.. రూ.20,000 కోట్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత లిక్విడిటీ పరిస్థితులను మదింపు చేసి, అదనంగా మరో రూ.10,000 కోట్లు అందించాలని నిర్ణయించామని ఆర్బీఐ తెలిపింది. ఈ నెలలో రెండు దశలుగా రూ.15,000 కోట్ల