STOCKS

News


వచ్చే ఏడాది ఐదో స్థానానికి చేరుకుంటాం

Friday 13th July 2018
news_main1531502297.png-18289

న్యూఢిల్లీ: అనుకున్న విధంగా ఆర్థిక వృద్ధి విస్తరణ కొనసాగితే వచ్చే ఏడాది భారత్‌ బ్రిటన్‌ అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, వాణిజ్య ఘర్షణల రూపంలో సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. నాలుగేళ్ల నుంచి వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిన భారత్‌, ఆర్థిక విస్తరణ కోసం రానున్న దశాబ్దం వైపు చూడాలన్నారు. భారత్‌ 2.59 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో 2017లో ఫ్రాన్స్‌ను వెనక్కు నెట్టేసి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాలు స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జైట్లీ ఈ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. 
‘‘వ్యాపార సులభతర నిర్వహణలో భారత ర్యాంకు గణనీయంగా మెరుగుపడడం, పెట్టుబడులకు అనుకూల దేశంగా మారడం చూశాం. ఈ రోజు పెరుగుతున్న ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధం వంటి సవాళ్లను ఎదుర్కొనే దశలో ఉన్నాం’’ అని జైట్లీ పేర్కొన్నారు.
తలసరి ఆదాయంలో వ్యత్యాసం
‘‘ఫ్రాన్స్‌ను ఏడో స్థానానికి నెట్టేసి భారత్‌ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, జనాభాలో తారతమ్యం దృష్ట్యా, రెండు దేశాల తలసరి ఆదాయంలో చాలా వ్యత్యాసం ఉండడం సహజమే’’ అని జైట్లీ పేర్కొన్నారు. 2017-18లో మన దేశ జీడీపీ 6.7 శాతంగా నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7-7.5 శాతం వరకు ఉంటుందన్న అంచనాలున్నాయి. పేదల అభివృద్ధి కోసం పటిష్టమైన విధానాలు, నిధులు ఖర్చు పెట్టకుండా కాంగ్రెస్‌ పార్టీ నినాదాలకే పరిమితమైందని విమర్శించారు. దీంతో పేదలు అభివృద్ధి చెందలేకపోయినట్టు చెప్పారు. ప్రధాని మోదీని చేతల మనిషిగా అభివర్ణించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఆదాయం, సామాజిక భద్రత, జీవన నాణ్యత పెరుగుతాయని, వ్యవసాయంలో అధిక ఆదాయం, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు సాధ్యపడతాయని జైట్లీ వివరించారు. మోదీ పాలనలో గ్రామీణ ప్రాంతాలు, తక్కువ ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలకు వనరులపై మొదటి హక్కు ఉంటుందని... దీనికి తోడు వ్యయాల పెంపుతో తదుపరి దశాబ్ద కాలంలో గ్రామీణ పేదలపై గణనీయమైన ప్రభావం ఉంటుందన్నారు. ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా ఈ ప్రయోజనాలు అందరికీ లభిస్తాయన్నారు.You may be interested

టాటా గ్రూపుపై హద్దుల్లేని నియంత్రణ కోసం ప్రయత్నం

Friday 13th July 2018

ముంబై: టాటా గ్రూపు చైర్మన్‌, బోర్డు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సైరస్‌ మిస్త్రీ ‘గ్రూపుపై హద్దుల్లేని నియంత్రణ’ పొందేందుకు ప్రయత్నం చేశారని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. ​టాటాసన్స్‌, రతన్‌ టాటాలకు వ్యతిరేకంగా టాటా గ్రూపు మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ చేసిన ఆరోపణల్లో ఎటువంటి యోగ్యత లేదని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై ప్రత్యేక బెంచ్‌ ఇటీవలే విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన కేసులో మరిన్ని వివరాలు వెలుగు

ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌

Friday 13th July 2018

11వేల మార్కును నిలుపుకున్న నిఫ్టీ చివరి అరగంటలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో  5రోజుల ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. లాభాల స్వీకరణతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకు, ఎఫ్‌ఎంజీసీ షేర్ల అమ్మకాల ఒత్తిడితో సూచీలు సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల 2శాతం ర్యాలీ సూచీల నష్టాలను తగ్గించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 7పాయింట్ల నష్టంతో 36,542 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు నష్టంతో 11,019 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. నేటి

Most from this category