రేటింగ్ అప్‌గ్రేడ్ చేయండి
By Sakshi

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాలంటూ అమెరికా రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీని కేంద్రం కోరింది. జీడీపీ-రుణ నిష్పత్తి దీర్ఘకాలికమైన అంశమని, రేటింగ్‌ను తక్షణం పెంచే విషయంలో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) పెరుగుతుండటం, రూపాయి మారకం విలువ పతనమవుతండటం తదితర అంశాల నేపథ్యంలో ఎస్అండ్పీ వర్గాలు గురువారం కేంద్ర ఆర్థిక శాఖతో సమావేశమైన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చాయి. ముడిచమురు రేట్ల పెరుగుదల, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వాటి ప్రభావం మొదలైన అంశాల గురించి కూడా ఇందులో చర్చించారు.
You may be interested
23 శాతం తగ్గిన పీఎఫ్ఎస్ లాభం
Friday 31st August 2018న్యూఢిల్లీ: పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్(పీఎఫ్ఎస్) కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 23 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.72 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.56 కోట్లకు తగ్గిందని పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.300 కోట్ల నుంచి రూ.325 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ అశోక్ హల్దియా చెప్పారు. తాము
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్ !
Friday 31st August 2018ముంబై: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ డైరెక్టర్‌గా చందా కొచ్చర్ నియామకం దాదాపు ఖరారైంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్‌కు అనుకూలంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఓటు వేసింది. ఈ బ్రోకరేజ్ కంపెనీలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు 80 శాతం వాటా ఉంది. వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చందా కొచర్‌ను సెలవుపై పంపారు. ఆమెపై ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో