STOCKS

News


దేశంలో జల రవాణా విప్లవం

Friday 11th January 2019
news_main1547186752.png-23530

న్యూఢిల్లీ: దేశంలో జలరవాణా విప్లవం రాబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఇది రవాణా వ్యయాన్ని 4 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా 30 శాతం మేర ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాండ్లా నుంచి ట్యూటికోరిన్‌ వరకు (వయా మంగళూరు, కొచ్చిన్‌) రవాణాకు ఉద్దేశించిన కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) తొలి కంటెయినర్‌ను మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. జల రవాణా మార్గాల అభివృద్ధి, గంగా నదిపై రవాణా నౌకలను నిర్వహించాలనే ఆలోచనలను ఎగతాళిగా చూసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బంగ్లాదేశ్‌, మయన్మార్‌కు వారణాసి ద్వారా ఎగుమతులకు మార్గం సుగమం చేశాం. రవాణా వ్యాయాన్ని 4 శాతం తగ్గిస్తే... 25-30 శాతం మేర ఎగుమతులు పెరుగుతాయి. మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. దీన్ని సాకారం చేయగలం’’ అని గడ్కరీ పేర్కొన్నారు. తీర ప్రాంత రవాణా వాటా చైనాలో 24 శాతం, జర్మనీలో 11 శాతం, అమెరికాలో 9 శాతంగా ఉంటే, భారత్‌లో 4.5- 5 శాతం మధ్యే ఉందని చెప్పారు. జల మార్గాల అభివృద్ధికి పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నట్టు తెలియజేశారు. 111 నదులను జల మార్గాలుగా మలచాల్సి ఉందని, ఇందులో 11 నదులపై ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గంగా నదిపై గతేడాది 80 లక్షల టన్నుల రవాణా జరిగిందని, 3 మీటర్ల మేర నీటి నిల్వలు కొనసాగిస్తే... 280 లక్షల టన్నులకు రవాణా పెరుగుతుందని చెప్పారాయన.

 



You may be interested

బడ్జెట్‌ ముందు బేర్స్‌దే హవా!

Friday 11th January 2019

గణాంకాల వెల్లడి పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే బడ్జెట్‌కు ముందు మార్కెట్లో ఎక్కువమార్లు బేర్స్‌ పట్టు బిగించినట్లు తెలుస్తోంది. పదేళ్లలో 12 మార్లు బడ్జెట్‌ సెషన్స్‌ వచ్చాయి. వీటిలో 9 సెషన్స్‌కు ముందు మార్కెట్లపై బేర్‌ పంజా విసిరాయి. ముఖ్యంగా 2016లో బడ్జెట్‌కు ఒకనెల ముందు సూచీలు దాదాపు 7 శాతం బేర్‌ మన్నాయి. బడ్జెట్‌కు ముందు 2013లో 6.1 శాతం, 2011లో 6 శాతం మేర సూచీలు నష్టపోయాయి. కేవలం 2010,

వ్యవసాయంలో ఎగుమతులపై దృష్టి

Friday 11th January 2019

న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.   వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు

Most from this category