STOCKS

News


2019లో పెరగనున్న చమురు డిమాండ్‌

Friday 9th November 2018
news_main1541741616.png-21814

న్యూఢిల్లీ: భారత్‌ చమురు డిమాండ్‌ 2019లో మెరుగుపడుతుందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ మైక్రో రిసెర్చ్‌ గురువారం విడుదల చేసిన తన తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొంది. తగిన ఆర్థిక పరిస్థితులు, కరెన్సీ స్థిరీకరణ, క్రూడ్‌ ధరల స్పీడ్ తగ్గడం దీనికి కారణాలుగా పేర్కొంది.  అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన క్రూడ్‌ ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత వంటి పలు ప్రతికూలతలు 2018లో భారత్‌ చమురు డిమాండ్‌పై ప్రభావం చూపాయని నివేదిక వివరించింది. ‘చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. అదే సమయంలో చమురుకు ప్రత్యామ్నాయంగా ఆ దేశం సాంప్రదాయేతర ఇంధన రంగంపై దృష్టి సారించింది. ఈ సమయంలో అంతర్జాతీయ చమురు డిమాండ్‌ వృద్ధిలో భారత్‌ పాత్ర చాలా కీలకమైనది. 

మొత్తం చైనా డిమాండ్‌ భర్తీ అసాధ్యం...
అయితే చమురుకు సంబంధించి తగ్గే చైనా డిమాండ్‌ మొత్తాన్ని భారత్‌ భర్తీచేస్తుందని భావించకూడదు. జనాభా, ఆర్థిక వ్యవస్థ పరిమాణం వంటి పలు అంశాల్లో భారత్‌కన్నా చైనా ముందున్న విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ- ఫిచ్‌కు అనుసంధానంగా ఉన్న ఫిచ్‌ సొల్యూషన్స్‌ పేర్కొంది. 2018లో చమురు వినియోగంలో వృద్ధిరేటు 5.5 శాతం ఉంటే, ఇది 2019లో 6 శాతానికి పెరుగుతుందని అంచనావేసింది. విశ్లేషణా పత్రంలో మరిన్ని అంశాలను పరిశీలిస్తే... ఈ ఏడాది జనవరిలో దాదాపు 64 వద్ద రూపాయి విలువ, అక్టోబర్‌లో 74కు పెరిగింది. అయితే పలు ఇతర వర్థమాన దేశాల కరెన్సీ విలువలూ పడిపోవడం వల్ల రూపాయి విలువ తగ్గుదల ప్రయోజనం భారత్‌కు లభించడం లేదు. దీనికితోడు చమురు ధరలూ పెరిగి, దిగుమతుల విలువను పెంచేశాయి. దీనితో ద్రవ్యోల్బణం సవాళ్లు నెలకొంటున్నాయి.  2019లో రూపాయి బలహీనతలు కొనసాగుతాయి. 2019 ముగింపుకు 76కు చేరే అవకాశం ఉంది.  ద్రవ్యోల్బణం ఒత్తిళ్లూ ఉంటాయి. వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి అమెరికాలో వడ్డీరేట్ల పెంపు దేశంలో రేటు పెంపు పరిస్థితులను సృష్టిస్తుంది.



You may be interested

స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో భారత్‌ది రెండో స్థానం

Friday 9th November 2018

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భారత్‌ వేగం పెంచింది. మూడవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌) స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో అమెరికాను మూడవ స్థానానికి నెట్టింది. చైనా తర్వాత 2వ స్థానానికి చేరింది. రిసెర్చ్‌ సంస్థ- క్యానలిస్‌ గణాంకాలను పరిశీలిస్తే- సమీక్షా కాలంలో చైనా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 10.06 కోట్లు. భారత్‌ విషయంలో ఈ సంఖ్య 4.04 కోట్లుగా ఉంది. అమెరికా అమ్మకాలు నాలుగు కోట్లు. అయితే ఈ మూడు మార్కెట్ల అమ్మకాల్లో పెద్దగా వృద్ధి

మరింతగా డిజిటల్‌ జోరు

Friday 9th November 2018

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంపై డిజిటల్‌ ప్రభావం మరింత జోరుగా ఉండనున్నది. మొబైల్‌, ఆన్‌లైన్‌ వంటి డిజిటల్‌ చానెళ్ల ద్వారా జోరు మీదున్న బ్యాంకింగ్‌  రంగంపై  2022 నాటికి డిజిటల్‌ పరంగా మరింత జోరు కనిపించనున్నదని ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌, ఎఫ్మాల తాజా నివేదిక పేర్కొంది. ఇన్ఫోసిస్‌ అనుబంధ సం‍స్థ, ఎడ్జ్‌వెర్వ్‌ సిస్టమ్స్‌కు చెందిన ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌, అంతర్జాతీయ స్వచ్ఛంద సం‍స్థ, ఎఫ్మాలు పదవ ‘బ్యాంకింగ్‌ రంగంలో నవకల్పనలు’ పేరిట నివేదికను రూపాందించాయి.

Most from this category