STOCKS

News


అక్టోబర్‌లో సేవల రంగం జోరు

Monday 5th November 2018
news_main1541404908.png-21719

  • 52.2కి పెరిగిన ఇండెక్స్‌..

భారత్‌లో సేవల రంగం అక్టోబర్‌ నెలలో వేగంగా వృద్ధి చెందింది. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 52.2కి ఎగసింది. కొత్త ఆర్డర్లు పెరగడం, దీంతో ఉద్యోగ సిబ్బంది విస్తరణ వంటి అంశాలు ఇందుకు కారణంగా నిలిచాయి. ఇండెక్స్‌ ఈ స్థాయిలో వేగంగా పెరగడం గత మూడు నెలల్లో (జూలై నుంచి చూస్తే) ఇదే ప్రథమం. కాగా సెప్టెంబర్‌లో ఇండెక్స్‌ నాలుగు నెలల కనిష్ట స్థాయి 50.9 వద్ద ఉంది. 
‘అక్టోబర్‌లో ధర ఒత్తిళ్లు తగ్గాయి. అలాగే ఉద్యోగుల పెరుగుదల మరొక సానుకూల అంశం’ అని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ప్రధాన ఆర్థికవేత్త పాలియన్న డే లిమా తెలిపారు.  ధర ఒత్తిళ్లు తగ్గడం, చమురు ధరలు దిగిరావడం వల్ల.. ద్రవ్యల్బోణం సమీపం నుంచి మధ్యస్థ కాలంలో రిజర్వు బ్యాంక్‌ నిర్దేశిత 4 శాతం దిగువునే ఉండొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు, రాజకీయ ఆందోళనలు కొనసాగితే వ్యాపార విశ్వాసంపైన, వృద్ధిపైన ప్రభావం పడొచ్చని తెలిపారు.  
కాగా పీఐఎం సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువన క్షీణతగా భావించడం జరుగుతుంది. 50పైన సూచీ కొనసాగుతుండడం వరుసగా ఇది 5వ నెల. 
 



You may be interested

బంగారం కన్నా ఈక్విటీ ముద్దు..

Monday 5th November 2018

దీపావళి వచ్చేసింది. మరీముఖ్యంగా ధంతేరాస్‌ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే పసడి కన్నా ఈక్విటీల్లో ఇన్వె‍స్ట్‌ చేయడం మంచిదని సూచిస్తున్నారు ఫండ్‌ మేనేజర్లు.  కోటక్‌ మహీంద్రా ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ షా మాట్లాడుతూ.. బంగారం కొనుగోలును ప్రోత్సహించనని, భారత్‌లో ప్రజలు అవసరమైన దాని కన్నా ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. గత దీపావళికి ఈక్విటీలు ఎలాంటి రిటర్న్స్‌ అందించలేదని, అవి ఇప్పుడు చౌక ధరకు

సిప్లా అంచనాలు మిస్‌..!

Monday 5th November 2018

ముంబై:- ఔషధ రంగ దిగ్గజం సిప్లా సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మిస్‌ అయ్యాయి. ఈ క్యూ2లో విశ్లేషకులు రూ.450 కోట్ల నికరలాభాన్ని అంచనా వేయగా, కంపెనీ రూ.377.05 కోట్ల నికరలాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఇదే క్యూ2లో విశ్లేషకులు రూ.4270 కోట్ల అమ్మకాలు అంచనా వేయగా, రూ.3,947.93 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ ఆర్జించిన రూ.3,988.24కోట్లతో పోలిస్తే అ‍మ్మకాలు 1శాతం తక్కువ. గతేడాది ఇదే క్యూ2లో

Most from this category