STOCKS

News


ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరిన కేంద్రం

Wednesday 10th April 2019
news_main1554880738.png-25050

న్యూఢిల్లీ: పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ చివరి నిమిషంలో వ్యయాలు తగ్గించుకోవడం, ఇంధన సబ్సిడీల చెల్లింపును వాయిదా వేయడం తదితర చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సర ద్రవ్య లోటు లక్ష్యాలను సాధించగలిగింది. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్య లోటును 3.4 శాతానికి (సవరించిన అంచనాల ప్రకారం) పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోగలిగింది. పన్ను వసూళ్లు ఊహించిన స్థాయిలో లేకపోయినప్పటికీ.. డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియతో పన్నేతర ఆదాయ వసూళ్లు కొంత ఎక్కువ రావడం కూడా ఇందుకు ఉపయోగపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు చెల్లించాల్సిన రూ. 25,000-30,000 కోట్ల సబ్సిడీ చెల్లింపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదలాయించడం మరికాస్త తోడ్పడిందని పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 3.3 శాతానికి పరిమితం చేయాలని నిర్దేశించుకున్నప్పటికీ.. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ౾మధ్యంతర బడ్జెట్‌లో దీన్ని 3.4 శాతానికి కేంద్రం సవరించిన సంగతి తెలిసిందే. 



You may be interested

లక్ష్యానికి రూ.50,000 కోట్ల దూరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు!

Wednesday 10th April 2019

- లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు - వసూలయ్యేది రూ.11.30 లక్షల కోట్లే! - 2018-19పై అంచనాలు న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు గడచని ఆర్థిక సంవత్సరం (2018-19) లక్ష్యాలకు రూ.50,000 కోట్ల లోటుతో ముగిసే అవకాశం ఉందని ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. లక్ష్యం రూ.12 లక్షల కోట్లుకాగా, ఇది రూ.11.5 లక్షల కోట్ల వద్దే ఆగిపోయే అవకాశం ఉందని అయన విశ్లేషించారు. నిజానికి 2018-19 నాటి బడ్జెట్‌లో

వచ్చే అయిదేళ్లలో ఎంఎస్‌ఎంఈలో కోటి ఉద్యోగాలు

Wednesday 10th April 2019

నోమురా రిసర్చ్‌ నివేదిక వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- వచ్చే నాలుగైదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలు ఒక కోటికిపైగా ఉద్యోగాలను సృష్టించనున్నాయని నోమురా రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన నివేదికలో వెల్లడించింది. మధ్య తరగతి వర్గాలు పెరగడం, ఖర్చు చేయదగ్గ ఆదాయాల్లో వృద్ధి వెరశి భారత్‌ను వినియోగానికి ఆకర్శణీయ మార్కెట్‌గా నిలబెట్టనున్నాయి. అయితే వినియోగం అవుతున్న ఉత్పత్తుల్లో దిగుమతుల వాటా గణనీయంగా ఉండడంతో దేశీయంగా తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాల

Most from this category