STOCKS

News


నవంబర్‌లో తయారీరంగం మెరుపులు

Tuesday 4th December 2018
news_main1543905115.png-22612

- 11 నెలల గరిష్టస్థాయి
న్యూఢిల్లీ: తయారీ రంగం నవంబర్‌లో 11 నెలల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ ఈ నెల్లో 54 కు చేరింది. అక్టోబర్‌ నెలలో ఇది 53.1. పటిష్ట డిమాండ్‌ పరిస్థితులు, కొత్త ఆర్డర్లు బాగుండడం వంటి అంశాలు తయారీ రంగం ఉత్పిత్తి పెరగడానికి కారణాలని నికాయ్‌ ఇండియా నెలవారీ సర్వే తెలిపింది. దాదాపు ఏడాది కాలంలో ఇంతస్థాయిలో పురోగతి ఎన్నడూ లేదని నికాయ్‌ ఇండియా పేర్కొంది. నిజానికి ఈ ఇండెక్స్‌ 50 పైన ఉంటే, వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ‍ప్రకారం- గడచిన 16 నెలల కాలంలో తయారీ పీఎంఐ 50 పైనే ఉంది. తాజా పరిస్థితి చూస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశావహ పరిస్థితులూ ఏర్పడుతున్నాయని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ప్రిన్సిపల్‌ ఎకనమిస్ట్‌, నివేదిక రూపకర్త పోల్యానా డీ లీమా పేర్కొన్నారు. వచ్చే 12 నెలల్లో కూడా తయారీ రంగానికి మంచి మార్కెట్‌ పరిస్థితులే ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.



You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సీఓఓగా శివరామన్‌

Tuesday 4th December 2018

ముంబై: రుణ భారంతో కుదేలైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్ అండ్‌ ఫైనాన్స్‌  (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ)గా ఎన్‌.శివరామన్‌ నియమితులయ్యారు. శివరామన్‌ రోజువారీ కార్యకలాపాలు చూస్తారని, గ్రూప్‌ ఆస్తుల విక్రయ ప్రయత్నాలను పర్యవేక్షిస్తారని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌, ఎమ్‌డీ అయిన వినీత్‌ నయ్యర్‌కు ఆయన తన కార్యకలాపాలను నివేదిస్తారని వివరించింది. శివరామన్‌ గతంలో ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌లో పనిచేశారు. ఇటీవల వరకూ ఎల్‌ అండ్‌

ఏప్రిల్‌ 1 వరకూ షేర్ల డీమ్యాట్‌ గడువు ముగింపు

Tuesday 4th December 2018

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కంపెనీల షేర్ల బదిలీని డీమ్యాట్‌ రూపంలోనే మార్చుకోవడానికి గడువు తేదీని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ పొడిగించింది. లిస్టెడ్‌ కంపెనీల షేర్ల బదిలీని  డీమ్యాట్‌ విధానంలోనే మార్చుకోవడానికి గడువు తేదీని ఈ నెల 5గా సెబీ గతంలో నిర్ణయించింది. ఇప్పుడు ఈ గడువు తేదీని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వరకూ పొడిగించింది. వివిధ వర్గాల నుంచి అందిన విన్నపాల మేరకు ఈ గడువు తేదీని పొడిగించామని వివరించింది.

Most from this category