STOCKS

News


బ్రిటన్‌ను మించనున్న భారత్‌

Monday 21st January 2019
news_main1548050135.png-23692

- ప్రపంచ ఎకానమీల్లో అయిదో స్థానానికి
- ఈ ఏడాది ర్యాంకింగ్స్‌పై పీడబ్ల్యూసీ అంచనాలు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఈసారి బ్రిటన్‌ను భారత్ అధిగమించవచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఒక నివేదికలో పేర్కొంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2017లో ఫ్రాన్స్‌ను దాటేసిన భారత్ 2.59 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ఆరో అతి పెద్ద ఎకానమీగా అవతరించింది. బ్రిటన్ ‍అయిదో స్థానంలో ఉంది. అయితే,  ఇక తాజా పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం భారత్‌ అయిదో స్థానానికి, ఫ్రాన్స్ ఆరో స్థానానికి చేరనుండగా.. బ్రిటన్ ఏడో స్థానానికి పడిపోనుంది. 2017లో బ్రిటన్ జీడీపీ 2.62 లక్షల కోట్ల డాలర్లుగాను, ఫ్రాన్స్ జీడీపీ 2.58 లక్షల కోట్ల స్థాయిలోనూ నమోదయ్యాయి. ప్రస్తుతం 19.39 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా (12.23 లక్షల కోట్ల డాలర్లు), జపాన్ (4.87 లక్షల కోట్ల డాలర్లు) జర్మనీ (3.67 లక్షల కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
    సాధారణంగా ఒకే స్థాయి అభివృద్ధి, జనాభా తదితర అంశాల కారణంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల స్థానాలు అటూ, ఇటూ అవుతూ ఉంటాయని.. కానీ భారత్ మాత్రం ర్యాంకింగ్‌ పెంచుకుంటూనే ఉందని పీడబ్ల్యూసీ తెలిపింది. గ్లోబల్ ఎకానమీ వాచ్‌ పేరిట రూపొందించిన బీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. 2019లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.6 శాతంగా ఉండనుండగా, ఫ్రాన్స్‌ది 1.7 శాతంగాను, బ్రిటన్‌ది 1.6 శాతంగాను వృద్ధి నమోదు కానుంది. "అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, చమురు సరఫరాపరమైన షాక్‌లేమీ లేకపోతే 2019-20లో భారత్ 7.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చు. కొత్తగా అమల్లోకి తెచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ), కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తొలి ఏడాదిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు అధిక వృద్ధికి ఊతమిచ్చే అవకాశం ఉంది" అని పీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రపంచ ఎకానమీపై ప్రభావం చూపే అంశాల ఆధారంగా పీడబ్ల్యూసీ ఏటా ఈ జాబితా రూపొందిస్తుంది.You may be interested

ఇద్దరు పీఎన్‌బీ ఈడీలపై వేటు

Monday 21st January 2019

న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం ప్రభావంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి చెందిన మరో ఇద్దరు అధికారులపై వేటు పడింది. విధుల నిర్వహణలో వైఫల్యం ఆరోపణలతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ (ఈడీ) కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్‌లను పదవీ బాధ్యతల నుంచి తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థను (సీబీఎస్‌), అంతర్జాతీయ లావాదేవీలకు ఉపయోగించే వ్యవస్థ

అంతర్జాతీయ ట్రెండ్‌, ఫలితాలే ఆధారం

Monday 21st January 2019

- సోమవారం కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఫలితాలు - ఐటీసీ, మారుతీ సుజుకీ, ఎల్‌ అండ్‌ టీ ఫలితాలు ఈవారంలోనే.. - క్రూడ్‌, రూపాయి కదలికలపై దృష్టి.. న్యూఢిల్లీ: ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) కార్పొరేట్‌ ఫలితాలు.. దేశీ స్టాక్‌ సూచీలకు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు పర్వాలేదనిపించుకోగా.. ఇండెక్స్‌ హెవీవెయిట్‌ అయిన ఐటీసీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై మార్కెట్‌

Most from this category