అమెరికా ఉత్పత్తులపై సుంకాల విధింపు మళ్లీ వాయిదా?
By Sakshi

అమెరికా ఉత్పత్తులపై సుంకాల విధింపు అమలును మన దేశం మరోసారి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా నిర్ణయం మన దేశ ఎగుమతులపైనా ప్రభావం చూపించనుంది. దీనికి ప్రతి చర్యగా, అమెరికా టారిఫ్‌ల వల్ల మన దేశంపై ప్రభావానికి సమానంగా... అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించేందుకు మోదీ సర్కారు నిర్ణయించింది. ఇందుకు 29 ఉత్పత్తులను ఎంపిక చేసింది. వీటిలో యాపిల్స్, వాల్నట్స్, పల్సెస్, కొన్ని రకాల ఐరన్, స్టీల్ ఉత్పత్తులు ఉన్నాయి. వాస్తవానికి ఈ టారిఫ్‌ల విధింపు ఆగస్ట్ 4 నుంచి అమలు చేయతలపెట్టగా, దాన్ని సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. ఇది మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, అధిక దిగుమతి సుంకం విధింపు అమలును మరో 45 రోజుల పాటు వాయిదా వేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఓ మీడియా సంస్థతో అన్నారు.
You may be interested
‘2008’ షాక్ నుంచి బయటపడని 500 స్టాక్స్!
Tuesday 18th September 2018స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అంత ఆషామాషీ వ్యవహారం కాదనేందుకు ఎన్నో నిదర్శనాలను చెప్పుకోవచ్చు. 2008 నాటి మార్కెట్ల పతనం గుర్తుండే ఉంటుంది. నాటి పతనానికి ముందు ర్యాలీ చేసిన స్టాక్స్‌లో సుమారు 500 స్టాక్స్ ఇప్పటికీ నాటి ధరలను చేరుకోలేదు. ఆలోపే ట్రేడవుతుండడం ఆశ్చర్యకరం. కానీ 2008 నాటి కనిష్ట స్థాయిల నుంచి చూస్తే మార్కెట్ ప్రధాన సూచీలు 400 శాతం పెరిగాయి. కొన్ని స్టాక్స్ నూరు శాతం నుంచి
ఐటీ -టు- ఫార్మా
Monday 17th September 2018ఐటీ నుంచి ఫార్మాకు మారాల్సిన సమయం వచ్చిందంటున్నారు ఏస్‌ప్రో అడ్వైజర్స్ భాగస్వామి, సీఐవో కుంజ్ బన్సాల్. గేమ్‌లో భాగంగా ప్రకటనలు వస్తుంటాయని, అయితే ఎగ్జిక్యూషన్ పరంగా చూస్తే ఎలాంటి ప్రకటనలు ఉండవని, వీటి ఆధారంగానే మార్పు ఉంటుందని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్థూల ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్నాయని, వాటిని మెరుగుపరిచేందుకు కేంద్రం ప్రయత్నింస్తోందని తెలిపారు. అయితే ప్రభుత్వ ప్రకటనలో చెప్పుకోదగ్గవేవీ