STOCKS

News


అంతర్జాతీయ ఐపీ సూచీలో భారత్‌కు 36వ స్థానం

Friday 8th February 2019
news_main1549605465.png-24082

  • 8 స్థానాలు పురోగతి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మోథోసంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్‌ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచుకుంది. 2018లో ఈ సూచీ 44 వద్ద ఉండగా, తాజాగా ఇది 8 స్థానాలు మెరుగుపడి 36కు చేరింది. 50 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై విశ్లేషణ ఆధారంగా ఈ సూచీ రూపొందింది. ఈ సూచీలో అమెరికా, బ్రిటన్‌, స్వీడన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు మొదటి తొలి ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. 45 ప్రమాణాల ప్రాతిపదికన అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పాలసీ సెంటర్‌ (జీఐపీసీ) ఈ సూచీని ఆవిష్కరిస్తుంది. పేటెంట్‌, ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌, వాణిజ్య రహస్యాల రక్షణ వంటి అంశాలు ఈ 45 ప్రమాణాల్లో ఉన్నాయి. సూచీలో భారత్‌ సాధించినంత పురోగతి మరేదేశమూ సాధించలేకపోవడం గమనార్హం. భారత విధాన నిర్ణేతలు తీసుకున్న చర్యలే దీనికి కారణమని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన పేర్కొంది.



You may be interested

బ్రోకరేజ్‌లు టార్గెట్‌ ధరలు పెంచిన టాప్‌టెన్‌ స్టాక్స్‌

Friday 8th February 2019

క్యు3 ఫలితాల అనంతరం బ్రోకరేజ్‌లు కొన్ని స్టాకులపై బాగా పాజిటివ్‌గా మారాయి. కొన్నింటి టార్గెట్‌ ధరలను పెంచాయి. అలాంటి టాప్‌టెన్‌ స్టాక్స్‌ వివరాలు... 1. ఐజీఎల్‌: డాయిష్‌ బ్యాంకు టార్గెట్‌ను రూ. 315 నుంచి 330కి పెంచింది. వచ్చే రెండేళ్ల ఎర్నింగ్స్‌ అంచనాలను 3 శాతం పెంచింది. ఈపీఎస్‌ వచ్చే రెండేళ్ల పాటు 18 శాతం చక్రీయ వార్షిక వృద్ది సాధిస్తుందని అంచనా వేసింది. కొత్త ప్రాంతాలకు విస్తరించడం ద్వారా రెవెన్యూ

టాటామోటర్స్‌ నష్టాలు రూ.26, 961కోట్లు

Friday 8th February 2019

ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం వరుసగా మూడో క్వార్టర్‌లోనూ నష్టాలే కంపెనీ జోరుకు జేఎల్‌ఆర్‌ బ్రేక్‌లు న్యూఢిల్లీ: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.1,215 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.26,961 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయని టాటా మోటార్స్‌ తెలిపింది. ఒక్క త్రైమాసికంలో ఈ స్థాయి నష్టాలు రావడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి.

Most from this category