STOCKS

News


భారత్‌ పన్నుల రాజేమీ కాదు

Monday 22nd April 2019
news_main1555915924.png-25261

కొన్ని రంగాలను కాపాడుకునే హక్కు ఉంది
నిపుణుల అభిప్రాయాలు

న్యూఢిల్లీ: భారత్‌ టారిఫ్‌ల విషయంలో కింగ్‌ (రాజు) ఏమీ కాదని, వ్యవసాయం వంటి కీలకమైన రంగాల ప్రయోజనాలను కాపాడుకునే హక్కు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్‌ దిగుముల సుంకాలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్నాయన్న అమెరికా ఆరోపణలను తోసిపుచ్చుతూ... అభివృద్ధి చెందిన జపాన్‌, దక్షిణ కొరియా, ఈయూ, అమెరికా సైతం అధిక టారిఫ్‌లను వ్యవసాయ ఉత్పత్తులపై కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భారత్‌ తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు మోపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ ఆరోపిస్తున్న విషయం గమనార్హం. ‘‘అమెరికా ఆరోపణలు పూర్తిగా అసత్యం. అమెరికాలో పొగాకు దిగుమతులపై 350 శాతం, వేరుశనగలపై 164 శాతం టారిఫ్‌లు ఉన్నాయి. వారు సైతం సహేతుక స్థాయిలో అధిక టారిఫ్‌లను నిర్వహిస్తున్నారు’’ అని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌ బిశ్వజిత్‌ ధార్‌ అన్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) ప్రొఫెసర్‌ రాకేశ్‌ మోహన్‌ జోషి సైతం ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అమెరికా ఆరోపణలు సరైనవి కావని, అభివృద్ధి చెందిన దేశంగా ముందు తన డ్యూటీలను క్రమబద్ధీకరించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడేది వాస్తవాలు కాదని ట్రేడ్ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మోహిత్‌సింగ్లా పేర్కొన్నారు. ‘‘ఇతర దేశాల మాదిరే దేశీయంగా కొన్ని రంగాల ప్రయోజనాలు కాపాడుకునేందుకు సరైన సమయంలో చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉంది. భారత్‌ కంటే అధిక టారిఫ్‌లను అమలు చేస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. డబ్ల్యూటీవో సభ్య దేశంగా భారత్‌ స్వేచ్ఛా, పారదర్శక, ఊహించతగ్గ వాణిజ్యానికి కట్టుబడి ఉంది’’ అని సింగ్లా పేర్కొన్నారు. కొన్ని ఉత్పత్తులపై జపాన్‌ 736 శాతం, దక్షిణ కొరియా 807 శాతం టారిఫ్‌లు అమలు చేస్తు‍న్నట్టు చెప్పారు. 



You may be interested

పెద్దల సంరక్షణకు వన్‌ బిగ్‌ ఫ్యామిలీ యాప్‌

Monday 22nd April 2019

హైదరాబాద్‌: పెద్దల సంరక్షణకు ఉద్దేశించిన ‘వన్‌ బిగ్‌ ఫ్యామిలీ’యాప్‌ను వెస్కో టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ విడుదల చేసింది. లొకేషన్‌ ట్రాకింగ్‌ సర్వీసెస్‌, ట్రావెల్‌ ప్రణాళికలు, మెడికల్‌ హిస్టరీ, కుటుంబ సభ్యులు, స్నేహితులను లింక్‌ చేసుకోవడం తదితర ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. యాప్‌ విడుదల సందర్భంగా వన్‌బిగ్‌ ఫ్యామిలీ ఇన్వెస్టర్‌ మాధవ్‌ రెడ్డి యాతం మాట్లాడుతూ... తమ తల్లిదండ్రులు ఎక్కుడ ఉన్నా, వారి కోసం వివిధ రకాల సేవలను అందించేందుకు,

భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నా.. నాలుగు, ఐదు ఫండ్స్‌ సరిపోతాయా

Monday 22nd April 2019

ప్ర: ఈ ఏడాదే నేను రిటైర్‌ కాబోతున్నాను. రిటై‍ర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.50 లక్షల వరకూ వస్తాయి. దీంతో రూ.15 లక్షల మొత్తాన్ని సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌) కింద ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మరో రూ.9 లక్షలను పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాను. మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? అశోక్‌, విజయవాడ  జ: ఈ వివరాలు ఆధారంగా మీ ఆర్థిక

Most from this category