STOCKS

News


విదేశీ వాణిజ్య రుణాలు 45% డౌన్‌

Tuesday 5th March 2019
news_main1551763966.png-24434

  • జనవరిలో 2.42 బిలియన్‌ డాలర్లకు పరిమితం

ముంబై: దేశీ కంపెనీలు ఈ ఏడాది జనవరిలో విదేశీ మార్కెట్ల నుంచి సేకరించిన మొత్తం రుణాలు (ఈసీబీ) 2.42 బిలియన్‌ డాలర్లు నమోదయ్యాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదేకాలంలో దేశీ సంస్థలు పొందిన విదేశీ వాణిజ్య రుణాలు 5.40 బిలియన్‌ డాలర్లు కాగా.. ఈ మొత్తంతో పోల్చితే ఈసారి 45 శాతం తగ్గుదల నమోదైంది. ఇక ఈఏడాది జనవరిలో 2.27 బిలియన్‌ డాలర్లను ఆటోమేటిక్ మార్గంలోనూ, మరో 150 మిలియన్‌ డాలర్లను ఆర్‌బీఐ అనుమతి మార్గంలో దేశీ సంస్థలు ఈసీబీలను సేకరించాయి. గతేడాది జనవరిలో మాదిరిగానే ఈసారి కూడా రూపీ డినామినేటెడ్ బాండ్లు(ఆర్‌డీబీ) జారీ ద్వారా విదేశీ రుణాలను పొందలేదని వెల్లడైంది. ఆటోమేటిక్ మార్గంలో అత్యధికంగా రుణాలను పొందిన దేశీ కంపెనీల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ 900 మిలియన్ డాలర్లు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 500 మిలియన్ డాలర్లు, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ 200 మిలియన్ డాలర్లను ఈసీబీల ద్వారా సేకరించాయి. ఈ మూడు ఆయిల్‌ రంగ దిగ్గజ సంస్థలు తమ మూలధనం కోసం రుణాలను సేకరించాయి. ఆర్‌బీఐ అనుమతి మార్గంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 228.55 మిలియన్ డాలర్లను సేకరించింది. రిలయన్స్ హోమ్‌ ఫైనాన్స్ 35.50 మిలియన్ డాలర్లను పొందినట్లు వెల్లడైంది.



You may be interested

మరిన్ని ఉత్పత్తులపై సుంకాల మినహాయింపునివ్వండి

Tuesday 5th March 2019

భారత్‌ను కోరిన చైనా న్యూఢిల్లీ: తమ దేశం నుంచి దిగుమతయ్యే మరిన్ని ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపునివ్వాలని భారత్‌ను చైనా కోరింది. చైనా నుంచి దిగుమతయ్యే 74 శాతం ఉత్పత్తులకు దశలవారీగా సుంకాల మినహాయింపునిచ్చేలా భారత్ ఆఫర్ చేయగా .. ఈ పరిమితిని 85 శాతానికి పెంచాలని చైనా కోరింది. దీనికి ప్రతిగా భారత్ నుంచి వచ్చే 92 శాతం దిగుమతులపై తాము సుంకాలపరమైన మినహాయింపులిస్తామని పేర్కొంది. సమగ్ర ప్రాంతీయ ఆర్థిక

4 బ్యాంకులపై రూ. 11 కోట్ల జరిమానా

Tuesday 5th March 2019

4 బ్యాంకులపై రూ. 11 కోట్ల జరిమానా న్యూఢిల్లీ: స్విఫ్ట్‌ మెసేజింగ్ సాఫ్ట్‌వేర్ నిర్వహణ విషయంలో ఆదేశాల ఉల్లంఘనకు గాను నాలుగు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ రూ. 11 కోట్ల జరిమానా విధించింది. కర్ణాటక బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌, కరూర్ వైశ్యా బ్యాంక్ ఇందులో ఉన్నాయి. కర్ణాటక బ్యాంక్‌పై రూ. 4 కోట్లు, యునైటెడ్ బ్యాంక్‌పై రూ. 3 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌పై

Most from this category